40.2 C
Hyderabad
April 29, 2024 18: 42 PM
Slider ప్రత్యేకం

ప్రభుత్వ పెద్దలతో విభేదాలే ప్రవీణ్ కుమార్ రాజీనామాకు కారణం?

#rspraveenkumar

అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనేది  ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి సుమారుగా  9 సంవత్సరాలుగా గురుకుల పాఠశాలల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అకస్మాత్తుగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. మరో ఆరు సంవత్సరాలు ఆయన సర్వీసు ఉన్నా రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది.

హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఆయన చేయించిన ప్రతిజ్ఞ ఇటీవలి కాలంలో పెను సంచలనం కలిగించింది. హిందూ సంస్థలు, భారతీయ జనతా పార్టీ ఆయనపై తీవ్ర స్థాయిలో అప్పటిలో ధ్వజమెత్తాయి. సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్, స్వేరో అధినేత పేరు దళిత వర్గాలన్నింటిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారనే ప్రచారం సైతం ఉంది.

ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రయివేటు పనులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చినా ఆయనను ప్రభుత్వం అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన అత్యంత సన్నిహితుడని, అందువల్లే చర్యలు తీసుకోవడం లేదని బిజెపి నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో తన రాజకీయ అవసరాలకు ప్రమీణ్ కుమార్ ను ఉపయోగించుకుంటారని, అందుకే ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవడం లేదని కూడా బిజెపి నాయకులు విమర్శించారు.

హుజురాబాద్ ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా ఆయన నిలబడబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లేనని, తనకు అలంటి ఆలోచన లేదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రవీణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానికంగా పనిచేస్తున్న గ్రామాల్లోనే ఉండాలని “మా ఊరికి రండి.. మాతోనే ఉండండి” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. హుజురాబాద్‌తో పాటు కమలాపూర్, భీమదేవరపల్లి, హుస్నాబాద్​ప్రాంతంలో ప్రవీణ్​కుమార్ ఈ నినాదంపై ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అప్పుటికే నక్సలైట్ పార్టీలో పనిచేసిన సానుభూతిపరులను సైతం ‘మా ఊరికి రండి’ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. దీంతో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కొంత ఆదరణ ఉంది.

హుజూరాబాద్ లో ఆయన ఈటల రాజేందర్ కు మద్దతుగా స్వేరో స్టార్ లను సమీకరించినందున ఈ విషయం తెలిసి కొందరు ఉన్నతాధికారులు కేసీఆర్ కు చెప్పడంతో ఆయన మందలించారని అందుకు మనస్తాపం చెంది ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారని మరో కథనం వినిపిస్తున్నది.

Related posts

తొలకరి చినుకులు…!

Satyam NEWS

రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సాయం

Bhavani

సత్యవేడు సమీపంలో 43ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Satyam NEWS

Leave a Comment