38.2 C
Hyderabad
April 29, 2024 19: 30 PM
Slider ప్రత్యేకం

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది వింటే పూర్తిగా మునిగిపోయేవాళ్లం

narendra modi

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పెద్దగా పట్టించుకోని దేశాలు కరోనా వైరస్ ను అదుపు చేయడంలో సక్సెస్ అయినట్లు ఒక అంచనా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా, ఇండియా పెద్దగా పట్టించుకోలేదు.

ఈ దేశాలలో కరోనా వైరస్ అదుపులో ఉంది. చైనా ఆదేశాల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నడుస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించిన తర్వాత ఆసక్తికరమైన పరిశీలన బయటకు వచ్చింది. భారత్ విషయానికి వస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలను పక్కనపెట్టి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి చేసిన సూచనలనే అమలు చేసింది.

గతంలో క్షయ వ్యాధిపై జరిపిన పోరాటంలోనూ, టీకాలు వేయించే కార్యక్రమంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారమే మన దేశం నడచుకుంది. ఇప్పటి వరకూ దానికి సంబంధించిన ఫలితాలు సరిగా లేవు. అందుకే మోడీ ప్రభుత్వం సొంత సంస్థలను నమ్ముకుని వ్యూహం రచించుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గేబ్రియోస్ జనవరి 30న ఒక డైరెక్టీవ్ జారీ చేస్తూ చైనా నుంచి ఇతర దేశాలు ట్రావెల్ బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అలా చేసిన దేశాలను ఆయన తప్పు పట్టారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం జనవరి 25నే చైనా నుంచి ట్రావెల్ బ్యాన్ చేశారు.

అత్యవసరమైన వారు తప్ప చైనా నుంచి ఎవరూ రావడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా భారత్ నుంచి ఎవరూ చైనా వెళ్లవద్దని కూడా ట్రావెల్ ఎడ్వయిజ్ జారీ చేశారు. ప్రపంచంలోని ఏ దేశం కూడా చేయని సమయంలోనే చైనా కు వెళ్లే విమానాలను జులై ఆఖరు వరకూ బ్యాన్ చేసిన తొలి దేశం మనదే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరిని పరీక్షించాలని కచ్చితంగా చెప్పింది. అయితే ఐసీఎంఆర్ మాత్రం పరీక్షల కన్నా వేరు వేరుగా ఉంచడమే సరైన మందు అని సిఫార్సు చేసింది. దాంతో నరేంద్రమోడీ పరీక్షల సంఖ్యను పెంచడం కన్నా ఐసోలేషన్ వార్డులను పెంచే పనిలో నిమగ్నమయ్యారు.

అన్ని రాష్ట్రాలకూ ఐసోలేషన్ వార్డులను పెంచాల్సించిదిగా కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఐసోలేషన్, భౌతిక దూరం పాటించడంలో భాగంగానే 21 రోజుల లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా ఐసీఎంఆర్ చేసిన సిఫార్సు కావడం గమనార్హం.

కరోనా వైరస్ సోకినా కూడా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా మనిషి ఉంటాడని ముందుగా ఊహించింది కూడా ఐసీఎంఆర్. 130 కోట్ల మందికి పరీక్షలు చేయడం సాధ్యం కాదని, అందువల్ల అనుమానం ఉన్నవారినందరిని ఐసోలేషన్ లో ఉంచడమే శ్రేయస్కరమని భారతీయ సంస్థ చెప్పినట్లే మోడీ చేశారు తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది వినలేదు. ఒక సారి నెగెటీవ్ వచ్చిన తర్వాత మళ్లీ అదే వ్యక్తికి మరొక్క సారి వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. వైరస్ పూర్తిగా పోయినట్లు కూడా చెప్పడానికి వీల్లేదు. వైరస్ వల్ల ఎలాంటి రోగ లక్షణాలు లేని వ్యక్తి మరింత మందికి దాన్ని అంటించే అవకాశం ఉంది. వీటన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణనలోకి తీసుకోలేదు. మనం కూడా వారి సిఫార్సులు విని ఉన్నట్లయితే నిండా మునిగి ఉండేవారం.

Related posts

అభాగ్యులకు అండగా దేవాడ గ్రామస్తులు

Satyam NEWS

రాజభవన్ సమీపంలో నూతన అసెంబ్లీ.?

Bhavani

కర్షకులకు బాసటగా నిలుద్దాం: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్

Satyam NEWS

Leave a Comment