40.2 C
Hyderabad
April 29, 2024 16: 39 PM
Slider మెదక్

కరెంటు ఇవ్వని కాంగ్రెస్ మనకెందుకు?

#Minister Harish Rao

అకాల వర్షాలతో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి లో జరిగిన ఈ కార్యక్రమంలో 4 వేల 300 ఎకరాలలో పంట నష్టానికి 4 కోట్ల 5 లక్షల రూపాయలను 393 మంది రైతులకు నష్టపరిహారం డబ్బు నేరుగా ఆయా బ్యాంకుల వెబ్సైట్ నుంచి మీట నొక్కి రైతుల ఖాతాల్లో పరిహారం డబ్బులు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధిక వర్షాలు వస్తే ఎప్పుడో ఎకరానికి 2 వేల రూపాయలు సాయం అనేది ఇస్తే అవి వస్తాయి. ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితిలో రైతులు వుండేవాళ్ళు. కాని తెలంగాణ రైతు ప్రభుత్వం ఎకరానికి 10 వేల చొప్పున నష్టపోయిన ప్రతి రైతు ఖాతాలో వేస్తున్నది. రూ 99 వేల పంట రుణాలు మాఫీకి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది.

మరో పక్షం రోజుల్లో రూ.లక్ష ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల త్వరలో చేయబోతుందని ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డి 3 గంటలు రైతులకు చాలు అంటున్నాడు వారికి మీరే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అంటే యూరియా బస్తాలకోసం చెప్పులు లైన్ లో పెట్టిన ప్రభుత్వం.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇస్తామనే కాంగ్రెస్ కావాలో, బాయిలకాడ మీటర్లు పెడతామన్న బిజెపి కావాలో మూడు పంటల 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన కేసీఆర్ కావాలో మీరే చెప్పండి అని ఆయన అడిగారు.

Related posts

ఓటమి తర్వాత హరీష్ రావుపై కేటీఆర్ వ్యాఖ్యలు

Satyam NEWS

పార్ట్ టైం టీచర్లను సీఆర్ టిలుగా రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS

అగ్నిపథ్ పథకంలో లోపాలను సవరించాలి

Satyam NEWS

Leave a Comment