ప్రాంతీయ భాషపై ప్రాంతీయ పార్టీ కత్తి కట్టడం ఏంటి అనే అంశం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో చర్చనీయాంశమైన విషయం తెలిసింది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే తమ భాష కోసం లేదా తమ ప్రాంతానికి చెందిన ప్రత్యేక అవసరాల కోసం జాతీయ పార్టీతో పోరాటం చేశాయి. జాతీయ పార్టీ ప్రాంతీయ భాషలకు, ప్రాంతాల అవసరాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రాంతీయ పార్టీలు ప్రతిఘటించేవి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ అయిన వైసిసి తెలుగు భాష ప్రాచుర్యానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంపై చాలా మంది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరి పై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కి తగ్గకపోవడానికి కారణం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. ఆయన కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పదే పదే చెప్పడం వెనుక అసలు వాస్తవ కారణం ఏమై ఉంటుంది అనేది ఎవరికి అంతుబట్టడం లేదు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు భాష భవిష్యత్తుకి భరోసా కల్పించాలని, తెలుగు విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఇదే అంశంపై తర్జన భర్జన పడుతున్నది. సిఎం జగన్ మత కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారని కొన్ని ప్రసార మాధ్యమాలు ప్రచారం చేస్తున్నాయి. దాంతో బిజెపి ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నది.
previous post