27.7 C
Hyderabad
April 26, 2024 05: 54 AM
Slider నిజామాబాద్

ఎయిడ్స్ దినోత్స‌వం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

Aids

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కామారెడ్డి, డైరెక్ట‌ర్ డీఎంహెచ్వో బాన్సువాడ అదేశానుసారం డివిజనల్ ఆరోగ్య బోధకుడు దస్థిరాం ఆధ్వర్యంలో బిచ్కుందలో ర్యాలీ నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా దస్థిరాం మాట్లాడుతూ హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది అంటే సాధారణంగా అనైతిక లైంగిక సంపర్కం, రక్తం ఎక్కించినప్పుడు, లాలాజలం, జననాంగాల సా‌వాలా వంటి వాటితో హెచ్ఐవి వ్యాపిస్తుంద‌న్నారు. హెచ్ఐవి అంటువ్యాధి కాద‌ని, అది వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి అని అన్నారు. వైరస్ సోకిన వ్యక్తి రక్తాన్నిమ‌రొకరికి ఎక్కించిన, హెచ్ఐవి సోకిన తల్లి మందులు వాడకుండా బిడ్డకు చనుపాలు ఇచ్చిన బిడ్డకు సైతం సోకుతుంద‌న్నారు. నెల రోజుల పాటు తప్పకుండా జ్వరం రావడం బరువు తగ్గిపోవడం బరువు తగ్గిపోవడం ఎక్కువ రోజులు విరోచనాలు కావడం అదేపనిగా దగ్గు రావడం మందులు వేసుకున్నా తగ్గకపోవడం ఎప్పుడు ఇన్ఫెక్షన్లు రావడం వంటి రావడం వంటి లక్షణాలు హెచ్ఐవి సోకిన వ్యక్తిలో కనిపిస్తాయ‌న్నారు. రక్తంలో తెల్ల రక్త కణాల్లో సీడీ-4 సంఖ్యను బట్టి హెచ్ఐవి ఎయిడ్స్ ను గుర్తిస్తార‌న్నారు. మొదలైన విషయాలను తెలుపుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో ప్లారెన్సు బాలమని ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Related posts

వినాయక చవితి హిందువుల తొలి పండుగ

Satyam NEWS

చంద్ర‌బాబు, అచ్చెంనాయుడులా సొల్లు మాట‌లు చెప్పం…!

Satyam NEWS

విశ్లేషణ: తెలుగును చంప వద్దు ఆంగ్లాన్ని పెంచ వద్దు

Satyam NEWS

Leave a Comment