23.2 C
Hyderabad
November 29, 2021 16: 23 PM
Slider శ్రీకాకుళం

తెల‌గ సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైసీపీ పార్టీ: ధర్మాన

#dharmanaprasadarao

తెల‌గ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లంతా ఆర్ధికంగా బాగా చితికిపోయార‌ని,వారి అభ్యున్న‌తికి వైసీపీ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని,అందులోభాగంగానే కార్పోరేష‌న్ ఏర్పాటు ,నిధుల కేటాయింపు చేశామని మాజీ మంత్రి, శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు. కాపు కార్పోరేష‌న్ డైర‌క్ట‌ర్లుగా ప్ర‌భుత్వం నియ‌మించిన  ఊడి సునీత‌, త్రివేణిలు సోమ‌వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఆయనను మ‌ర్యాద‌పూర్వంగా క‌లిశారు.

ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ  వ్య‌వ‌సాయ కుటుంబాల నుంచి వ‌చ్చిన తెల‌గ సామాజిక‌వ‌ర్గం ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయం ఇబ్బందుల‌లో ప‌డ‌డంతో వారు కూడా ఇబ్బందులు పాల‌య్యార‌ని, ఆర్ధికంగా చితికిపోయార‌ని చెప్పారు. వ్య‌వ‌సాయం నేరుగా వారే చేసుకున్న‌వారంతా వ్య‌వ‌సాయ రంగంలో ఉన్నార‌ని,  గ‌ట్టు మీదు నిల‌బ‌డి వ్య‌వ‌సాయం చేయించే కుటుంబాలు నేడు వ్య‌వ‌సాయ రంగంలో నిల‌దొక్కుకోలేక‌పోతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అందుకే ప్ర‌భుత్వం ఆదుకోవాల‌న్న ఆశ‌యంతో కాపు కార్పోరేష‌న్ ఏర్పాటు చేసి నిధులు కూడా కేటాయించ‌మన్నారు.

ఆర్ధికంగా చితికిపోయిన వారిని గుర్తించి వారికి ఆర్ధిక చేయూత ఇచ్చేలా డైర‌క్ట‌ర్లు  ప‌నిచేయాల‌ని,ఈ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటుంద‌ని, వారి బాద‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ప‌నిచేస్తుంద‌ని ఎమ్మెల్యే చెప్పారు. ప్ర‌జా సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని, ఇచ్చిన హామీల‌ను  నెర‌వేర్చే ప‌నిలో సీఎం జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి ఉన్నార‌ని, ఆ దిశ‌గా ప‌నిచేస్తున్న‌ప్పుడు ఆర్ధిక వ‌న‌రులు స‌ర్దుబాటు కొంత క‌ష్టంగా ఉంటుంద‌ని, క‌రోనా కార‌ణాన  రాబ‌డి లేక‌పోయింద‌ని ,ఇలాంటి ప‌రిస్ధితుల్లో ప్ర‌తిప‌క్షాలు కొన్ని విమ‌ర్శ‌లు చేస్తుంద‌ని,ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని వివ‌రించారు.

డైర‌క్ట‌ర్లును ధ‌ర్మాన అభినందించారు.ఈ సంద‌ర్బంగా ధ‌ర్మాన‌కు  సంఘం పెద్ద‌లు, నాయ‌కులు, ప్ర‌తినిధులంతా ఘ‌న స‌న్మానాన్ని చేసి కృత‌ఘ్న‌త‌ను చాటుకున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా తెల‌గ సంక్షేమ సంఘం నాయ‌కులు  రొక్కం సూర్య‌ప్ర‌కాశ‌రావు, వూడి శ్యామ్‌,సుంక‌రి కృష్ణ‌, పిల్ల‌ల నీలాద్రి, ఇనుముల జనార్ధన, మేడిబోయిన, మాధవరావు,సిరిగిరి వ‌ర‌ద‌రాజు,రొక్కం బాల‌కృష్ణ‌,శ‌వ్వాన ఉమామ‌హేశ్వ‌రి, రొక్కం స‌త్య‌నారాయ‌ణ‌,శవ్వాన ఉమామ‌హేశ్వ‌ర‌రావు. మునుకోటి సత్యనారాయణ ,పుట్టా అంజ‌నీకుమార్‌,వెంక‌టేశ్వ‌ర‌రావు,మండపాక నర్సింగరావు, లాల్ చెట్టు గోవిందరావు తోట నందకుమార్ త‌దిత‌రులున్నారు.

Related posts

ప్రతి నిరుపేదను ఆదుకొని ఆర్ధిక సహాయం అందించాలి

Satyam NEWS

క్లారిటీ: రాష్ట్రాలు తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం

Satyam NEWS

ఎనాలసిస్: ఆర్ధిక ఉద్దీపనకు నిర్మలమైన ప్యాకేజీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!