37.2 C
Hyderabad
May 1, 2024 11: 24 AM
Slider విజయనగరం

సోషల్ మీడియా ద్వారా విషప్రచారాన్ని తిప్పి కొడతాం

#majjisrinivasarao

విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత బాధ్యతగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని విజయనగరం జెడ్ పి చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శీను) అన్నారు.

గుంటూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం అందరి సహకారంతో దిగ్విజయం చేశామని అందుకు జిల్లా నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఎందరో అభిమానులు రావాలని అనుకున్నా, కొన్ని కారణాలు వల్ల అందరికీ అవకాశం కల్పించలేక పోయామని, వారంతా క్షమించాలని ఆయన కోరారు.

ప్లీనరీ సమావేశాలు అంచనాలకు మించి జరగడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల పై అర్థవంతమైన చర్చ జరిపామన్నారు. వచ్చే రెండేళ్లలో తీసుకోబోయే చర్యలపై చర్ లు జరిపామని జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారన్నారు.

ఎల్లో మీడియా కథనాలను తిప్పి కొట్టేలా కార్యకర్తలకి పిలుపునిచ్చారు. గత ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యేలా పార్టీను బలోపేతం చేస్తామన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలనుమ్స గడప గడప కి తీసుకు వెళ్తామన్నారు. తమ ప్రభుత్వంపై మూడేళ్ళుగా విషం చిమ్మే ప్రయత్నం చేశారో దాన్ని సోషల్ మీడియా ద్వారా, వైఎస్సార్ సీ పీ సైన్యం ద్వారా తిప్పి కొడతామని ఆయన తెలిపారు.

మేనిఫెస్టోను అమలు చేసిన విధానాన్ని ప్రజలకి వివరిస్తామని అన్నారు. ప్లీనరీలో ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు తనకు అప్పగించారన్నారు. తన వంతుగా బాధ్యతలు నిర్వర్తించానని ఆయన తెలిపారు. తమ అధినేత మున్ముందు ఏ బాధ్యత అప్పగించినా, చేయడానికి సిద్ధంగా ఉంటానని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శీను అన్నారు.

Related posts

నిరుద్యోగులకు శుభవార్త: ఎక్సైజ్, ఫారెస్ట్, ఫైర్ సర్వీసు ఖాళీల భర్తీకి అనుమతి

Satyam NEWS

ఫిబ్రవరి 1 నుండి మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

Satyam NEWS

పురాతన ఆలయాల అభివృద్ధికి 10 కోట్లు మంజూరు

Satyam NEWS

Leave a Comment