40.2 C
Hyderabad
April 26, 2024 11: 15 AM
Slider నల్గొండ

త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దొరల గడీలో బందీ

#ysrtp

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ, మండలం లక్కవరం గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని వైయస్సార్ తెలంగాణ పార్టీ లక్కవరం గ్రామ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అద్భుతంగా పాలన సాగించారని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద పిల్లలకు ఉన్నత చదువులు చేరువ చేశారని,ఐదేండ్లలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 46లక్షల పక్కా ఇండ్లు కట్టించారని అన్నారు.

108,104 సర్వీసులు ప్రవేశపెట్టి మారుమూల గ్రామాలకు సైతం వైద్యాన్ని పేదలకు చేరువ చేశారని,ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి తద్వారా పేదలకు సైతం కార్పొరేట్  వైద్యం అందించారని అన్నారు. మహిళలకు పావలా వడ్డీకే ఋణాలు ఇచ్చి ఆదుకున్నారని,ఐదేండ్లలోనే మూడు సార్లు నోటిఫికేషన్లు వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు.ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలు సృష్టించారని అన్నారు. కెసిఆర్ ఏడెండ్ల పాలనలో నిరుద్యోగుల కొరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా వారి ఆత్మ హత్యలకు కారణం అవుతున్నారని, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దొరల ఘడీలో బందీ అయ్యిందని,గడీల పాలన అంతమొందించాలంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సుపరిపాలన తెలంగాణలో వైయస్ షర్మిల తోనే సాధ్యమవుతుందని అన్నారు. షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి  200 మంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఆదెర్ల శ్రీనివాస రెడ్డి సమక్షంలో చేరారు.

ఈ కార్యక్రమంలో రణపంగు నాగరాజు,కస్తాల ఇమ్మానేలు, రణపంగు నాగరాజు,నరసయ్య,వెంకన్న, శ్రీను, చంద్రయ్య, కనకయ్య, జగన్నాథం, అనిల్,పుల్లయ్య,ప్రసాదు,బిక్షం,రమేష్, సతీష్,రాంబాబు,రామకృష్ణ, అజయ్,దానేలు,అఖిల్ బాబు,శ్రీకాంత్, ప్రవీణ్,వెంకటేష్,గోపి,బాలు,వంశీ, నజం,చైతన్య,బిక్షం,ప్రశాంత్,దావత్, ఆనంద్, విజయ్, అరవింద్, నవీన్,బద్రి, ప్రభాకర్,రాకేష్,రాజేష్,మహేష్,బెంజి, వీరబాబు,మట్టయ్య,నరసింహ,గోపి, ఏసు,జయరాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

సి.సి. రోడ్లకు నిధులు మంజూరు చేయాలి

Sub Editor

గుడ్ డెసిషన్: మొక్కలు నాటడమే కాదు వాటిని పెంచుతా

Satyam NEWS

Leave a Comment