42.2 C
Hyderabad
April 26, 2024 17: 31 PM
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడుతున్న హంసలదీవి

kona raghupathi

కార్తీక మాసం అంటేనే ఎంతగానో విశిష్టత సంతరించుకున్న రోజు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటాం. కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైందని, దీన్ని త్రిపురారి పౌర్ణమి అనికూడా అంటారు. హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపాలు తొలగి, మోక్షం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే కార్తీక పౌర్ణమి శోభతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. కార్తీకపౌర్ణమి సందర్భంగా హంసలదీవి బీచ్ కు భారీగా భక్తులు తరలివచ్చారు. వేలాది మంది భక్తులు సూర్యోదయానికి ముందే సముద్ర స్నానమాచరించారు. పాలకాయతిప్ప నుండి హంసలదీవి బీచ్ వరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కోడూరు పోలీస్ సిబ్బంది చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భక్తులకు ఏర్పాట్లు చేసి అవనిగడ్డ పోలీసు, మెరైన్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బీచ్ లో కోడూరు పి.హెచ్.సి వైద్యబృందం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రెవిన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏపి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూర్యలంక తీరంలో “కర్పూర హారతి” కార్యక్రమం నిర్వహించారు.

Related posts

అన్ని దానాల కన్న అన్నదానం మిన్న

Satyam NEWS

స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీ

Satyam NEWS

నెల్లూరు సింహపురి విశ్వవిద్యాలయం లో ఔషధ మొక్కల వనం

Satyam NEWS

Leave a Comment