39.2 C
Hyderabad
April 28, 2024 13: 19 PM
Slider జాతీయం

తీపి చేదుల కలయిక 2020 రౌండప్

2020

అయోధ్యలో రామ మందిర నిర్మాణ ఘట్టానికి 2020లో తెరపడగా, మరోవైపు కరోనా పంజా విసిరింది. ఇంకోవైపు మర్కజ్ ఘటనతో తబ్లీగీ జమాతీ వార్తల్లో నిలవగా, వందల కిలోమీటర్లు ప్రజలు కాలిబాట పట్టిన ఘటనలు కోకొల్లలు.. ఇక ఇలాంటి 2020కి ముగింపు రానే వచ్చింది. ఇక ఈ సంవత్సరం చరిత్ర పుటల్లో కేవలం ఒక సంవత్సరంగా మిగిలిపోనుండగా ఈ సంవత్సరాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి మాత్రం ఇదొక భయానక సంవత్సరమనే మనసుల్లో నాటుకుపోనుంది. ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని ఘటనల వివరాలు..

సీఏఏ, ఎన్సీరీల‌పై ఆందోళ‌న‌లు

సంవత్సరం మొదట్లోనే సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫిబ్రవరిలో ఈ చట్టాలపై ఆందోళనలు ఉధ్రతం కాగా 23 ఫిబ్రవరి నుంచి 29 ఫిబ్రవరి వరకూ ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 53 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. అనంతరం షాహీన్బాగ్లో ఈ చట్టాలను రద్దు చేయాలని చాలా రోజులే ఆందోళనలు కొనసాగాయి.

క‌ర్ణాట‌క‌లో క‌రోనా మొద‌టి మ‌ర‌ణం

చూస్తూ చూస్తూ హోళీ సంబరాల్లో మునిగిపోదామనుకుంటున్న దేశ వాసులకు మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. 17 మార్చి కర్ణాటకలో కరోనాతో మొదటి మరణం నమోదయ్యింది. అనంతరం కరోనా మహమ్మరి దేశంలో తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. 1.5 లక్షల మంది ఈ సంవత్సరంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఎస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్ష‌లు

2020 మార్చి ప్రారంభంలో ఎస్ బ్యాంక్ పై ఆర్బీఐ పలు ఆంక్షలను విధించింది. దీంతో యస్ బ్యాంక్లో అప్పటికే కోట్లాది రూపాయలు జమ చేసిన వారిలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆర్బీఐ ఆంక్షలతో బ్యాంకు షేర్ దబేల్ను కిందకు పడి కేవలం రూ. 5వద్దకు వచ్చి తీవ్ర నష్టాల్లోకి బ్యాంకు చేరుకుంది. దీంతో బ్యాంకులో ఖాతా ఉన్నవారు లబోదిబోమన్నారు.

సంపూర్ణ లాక్‌డౌన్‌.. 16 మంది కూలీల‌పై గూడ్స్ రైలు..

కరోనాను నివారించేందుకు దేశంలోని 25 మార్చి నుంచి 21 రోజులపాటు సంపూర్ణంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రైన్లు,బస్సులు, విమానాల రాకపోకలు నిలిచిపోయి ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ఈ రోజుల్లో రోడ్లపై చీమచిటుక్కుమనలేదు. ఈ సందర్భంగా దేశవాసులను తీవ్రంగా కలిచివేసిందనే చెప్పాలి. 1947లో ఇలాంటి సంఘటన భారత్-పాకిస్థాన్ విభజన సమయంలో కనిపించిందని చరిత్రకారులు చెబుతారు. దీంతో ఆయా ప్రజలు, కూలీలు పనులు దొరక్క తమ తమ ఇళ్లకు వెళ్లాలనే తాపత్రయంతో నడుచుకుంటూ పట్టాలపై వెళుతుండగా 8 మార్చి మహారాష్ర్ట ఔరంగబాద్ ట్రాక్పై 16 మంది కూలీలపై గూడ్స్ ట్రైన్ వెళ్లింది. దీంతో వీరంతా అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తితింది.

నిర్భ‌య దోషుల‌కు ఊరిశిక్ష‌

దేశ చరిత్రలో మరో ఘటన 20 మార్చిన నిర్భయ దోషులు పవన్, ముఖేష్, అక్షయ్, వినయ్లను తిహార్ జైలులో నెం. 3లో ఊరిశిక్షను అమలు చేశారు. ఏడు సంవత్సరాల ముందు 16 డిసెంబర్ 2012న జరిగిన ఘటనలో సుధీర్ఘ పోరాటం అనంతరం నిర్భయ కుటుంబీకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జ్యోతిరాధిత్య గుడ్‌బై ఎంపీలో శివ‌రాజ్‌సింగ్కు ప‌ట్టం

2020లో రాజకీయాల్లో కూడా చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ఇందులో మధ్యప్రదేశ్ కమలనాథ్ ప్రభుత్వం కూలిపోయి శివరాజ్సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. కాంగ్రెస్లో కంచుకోటగా ఉన్న నేత జ్యోతిరాధిత్య సింధియా తన 22 మంది మద్దతు దారులతో పార్టీకి గుడ్బై చెప్పారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో చీలికలు ఏర్పడ్డాయి. అనంతరం 20 మార్చిన కమల్నాథ్ రాజీనామా చేశారు. 23 మార్చిన శివరాజ్సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బెంగాల్‌లో ఉంఫ‌న్ బీభ‌త్సం

ఓ వైపు కరోనాతో అతలాకుతలం అవుతుండగానే మరోవైపు బెంగాల్లో ఉంఫన్ తుఫాన్ తన ప్రభావాన్ని చూపింది. ఈ తుపాను తీవ్రత కారణంగా దేశంలోని పశ్చిమ రాష్ర్టాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. కరోనా కంటే భయంకరమైనది ఈ తుపాను ప్రభావం అని స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడం గమనార్హం. ఉంఫన్ కారణంగా బెంగాల్లో 13.9 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. 30 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. 88 వేల హెక్టార్లలో పంట నీట మునిగింది. రైతులు,ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారు.

మిడ‌త‌ల గుంపుతో రైతుల‌కు న‌ష్టం

పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల గుంపు భారత్లోని సరిహద్దు రాష్ర్టాలపై పంజా విసిరింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట ఇలా సుమారుగా మిడతల గుంపు అంటేనే ప్రభుత్వాలు భయపడేలా పంటలపై ఈ పురుగులు దాడులకు దిగాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. రైతులు తమ పంటలను కోల్పోయారు. తెలుగు రాష్ర్టాల్లోకూడా మిడతలు వస్తున్నాయనే పుకార్లు షికార్లు చేయగా ముందుగానే వాటిని నివారించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వాలు చేసిన విషయం మనకు జ్ఞాపకమే.

లద్దాఖ్ ఘ‌ట‌న‌తో భార‌త్‌-చైనాల్లో పెరిగిన అంత‌రం

15-16 జూన్ లద్దాఖ్ బార్డర్ వద్ద భారత-చైనా బలగాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ ఘర్షణలో ఉన్నట్టుండి చైనా దాడి చేయడంతో 20 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలర్పించారు. ఈ ఘర్షణల్లో చైనాకు చెందిన 40 మంది సైనికులు చనిపోయినప్పటికీ ఆ విషయాన్ని చైనా చాలారోజుల వరకూ కప్పిపుచ్చుతూ వచ్చింది. ఈ వివాదం 5 మార్చి నుంచే కొనసాగిందని భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ ఘటన అనంతరం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా పలు నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా చైనాకు చెందిన వంద అప్లికేషన్లను (యాప్) నిషేధం విధించింది. దీంతో చైనాతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు నెలకొన్నాయి. యాప్ల నిషేధంతో చైనాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి నేటివరకూ చైనా-భారత్ సంబంధాల్లో మెరుగుదల ఏ మాత్రం కనిపించకపోవడం విశేషం.

భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు చోటు

కరోనా, ఉంఫన్, చైనా వివాదాలతో సతమతమవుతున్న భారతదేశానికి జూన్లో ఉపశమనం కలిగేలా ఓ నిర్ణయం వెలువడింది. అమెరికా భద్రతా మండలి నిర్వహించే సదస్సులో (యూఎన్ఎస్సీ) 8వ సారి భారత్ ఎంపికైంది. భారత్కు మద్దతుగా జరిగిన ఈ ఓటింగ్లో 184 దేశాలు భారత్కు అనుకూలంగా ఓటేశాయి. దీంతో భారత్ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూసిన చైనా పాకిస్థాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

రాఫెల్‌తో శ‌త్ర‌వుల గుండెల్లో గుబులు

చైనాతో వివాదం అనంతరం పాకిస్థాన్ కూడా భారత్పై అక్కసు వెళ్లగక్కడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో 27 జూలైలో ఫ్రాన్స్ నుంచి భారత్ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చాయి. దీంతో భారత్ వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరిగాయి. నవంబర్లో మరో మూడు రాఫెల్ విమానాలు భారత్కు సమకూరాయి. ఫ్రాన్స్తో మొత్తంగా 36 విమానాల కొనుగోలు ఒప్పందం జరిగింది.

మాఫియా డాన్ వికాస్ దూబే ఎన్‌కౌంట‌ర్‌

3 జూలైన ఖాన్పూర్ గ్రామం వార్తల్లో నిలిచింది. ఇక్కడ మాఫియా లీడర్గా చెలామణి అవుతున్నవికాస్ దూబేను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా పోలీసులపై దాడులకు తెగబడ్డాడు. సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా దేశమంతా ఉలక్కిపాటుకు గురైంది. అనంతరం వికాస్ దూబేను మధ్యప్రదేశ్లో పట్టుకోగా ఖాన్పూర్ ఎన్కౌంటర్లో మరణించాడు. ఎనిమిది రోజుల్లోనే యూపీ పోలీసులు వికాస్ దూబే గ్యాంగ్ను ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. ఈ ఘటనతో యూపీలోని నేరస్థుల గుండెల్లో గుబులు మొదలైంది.

దుబాయ్‌లో ఐపీఎల్ వ్యూవ‌ర్‌షిప్‌లో భారీ పెరుగుద‌ల‌

కరోనా నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ 13 నిర్వహించేందుకు నిర్ణయించింది. దుబాయ్లో ఐపీఎల్ మ్యాచ్లు 19 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాగా 10 నవంబర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్-13 విజేతగా నిలిచింది. రోహిత్ వర్మ నేత్రత్వంలో ముంబై ఇండియన్స్ ఐదోసారి ఐపీఎల్ను చేజిక్కించుకుంది. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణతో ఆయా స్పోర్ట్స్ చానళ్ల వ్యూవర్ షిప్లు ఒక్కసారిగా 23 శాతానికి పెరిగాయి. దీంతో ఆయా చానళ్లు భారీగానే లాభాలనార్జించాయి.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం.. జీడీపీలో భారీ త‌గ్గుద‌ల‌

ప్రపంచదేశాలన్నింటిపై కరోనా ప్రభావం చూపింది. దీంతో ఆయా దేశ ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా చిన్నాభిన్నమైపోయాయి. కరోనా నేపథ్యంలో ఒకదశలో భారతదేశ జీడీపీ కూడా 23.9 శాతానికి పడిపోయింది. 1996లో ఇంతగా భారతదేశ జీడీపీ వ్యవస్థ పతనమైంది.

కిసాన్ క్ర‌షి చ‌ట్టంపై రైతుల వ్య‌తిరేఖ‌త‌

ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రైతుల కోసం కిసాన్ క్రషి అనే చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేసింది. కానీ దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు అనుమానాలకు తావిచ్చేలా ఆయా పథకం బిల్లులు ఉన్నాయని ఆందోళనలు చేపట్టారు. ఇప్పటివరకూ ఈ ఆందోళనలు కొనసాగుతున్న విషయం విదితమే.

పుంజుకున్నఆర్థిక వ్య‌వ‌స్థ‌

కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైనప్పటికీ, భారతదేశ ఆర్థిక నిపుణుల సలహాలతో సెన్సెక్స్ 46890కి ఎగిసింది. నిఫ్టీ 13740 ముగిసింది. బంగారం, వెండి ధరలు కూడా ఆకాశన్నంటాయి. 56191 10 గ్రాములకుబంగారం ధర చేరడం విశేషం. వెండి 77949 కిలోకు చేరడం విశేషం.

ఖగోళంలోనూ మార్పుచేర్పులు

2020లో భూమిపై నివసిస్తున్న మానవాళిపై తీవ్ర ప్రభావమే కనిపించగా 21 డిసెంబన్ బ్రహస్పతి-శని గ్రహాలు దగ్గరయ్యాయి. వీటి దూరం 0.06 డిగ్రీలుగా శాస్ర్తవేత్తలు అంచనా వేశారు. దీంతో రెండు గ్రహాలు కలుస్తున్నట్లుగా గోచరించాయి. ఇలాంటి ఘటనలు అరుదేనని, మళ్ళీ ఈ రెండు గ్రహాలు దగ్గరగా రావడానికి 400 సంవత్సరాలు పడుతుందని 1623లో ఒకసారి ఈ గ్రహాలు ఇంత దగ్గరగా వచ్చాయని శాస్ర్తవేత్తలు వివరించారు.

Related posts

పరువు హత్య జరగకుండా చొరవ తీసుకున్న పోలీసులు

Satyam NEWS

సేవలే సంతృప్తినిస్తాయి: పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్

Satyam NEWS

ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక ఏకగ్రీవం

Satyam NEWS

Leave a Comment