38.2 C
Hyderabad
April 27, 2024 15: 54 PM
Slider ముఖ్యంశాలు

పార్లమెంట్‌లో ‘అదానీ’ రభస

#parliament

అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. మార్కెట్‌లలో అదానీ గ్రూప్‌ డీలాపడినందున ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో లోక్‌సభలో, రాజ్యసభలో అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలపై కూడా చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దాంతో ఉభయసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్‌సభలో స్పీకర్‌, రాజ్యసభలో చైర్మన్‌ సభను కంట్రోల్‌లో పెట్టే ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. దాంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదాపడ్డాయి. తర్వాత రెండు సభలు ప్రారంభమైనప్పటికీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. దాంతో ఉభయసభలను ఈ నెల 6వ తేదీకి (సోమవారానికి) వాయిదా వేశారు.

Related posts

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Satyam NEWS

అందరి ముందు అద్భుతం ఆవిష్కరించిన ఆనందయ్య మందు

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణ ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment