28.7 C
Hyderabad
April 27, 2024 05: 09 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఈ కమిటీలు మెంటల్ ఆసుపత్రి నుంచి వచ్చాయా?

narayana

అమరావతి రాజధాని తరలిస్తే  ప్రజా ఉద్యమ ఉప్పెనలా  ఉంటుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. శనివారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లో అమరావతి పరిరక్షణ సమితి జే.ఏ.సి ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. దీనికి జిల్లా వ్యాప్తంగా అఖిలపక్ష నాయకులు తరలివచ్చారు.

ఈ బహిరంగ సభకు జేఏసి జిల్లా కన్వీనర్ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ముందుగా జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ మూడు రాజధానులు తో పాటు మూడు ముఖ్యమంత్రులను పెడతారా అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నవ్వుతే భయం వేస్తుందని ఆయన అన్నారు.

ఒకసారి నవ్వినప్పుడు ప్రజా వేదిక కూల్చివేత ,మరొకసారి నవ్వినప్పుడు పోలవరం ఆగిపోయిందని ఇప్పుడు పెద్దగా నవ్వినందుకు రాజధాని ఇలా అవుతుందని ఆయన ఆయన చలోక్తి విసిరారు. ఆర్ పి ఐ రాష్ట్ర కార్యదర్శి పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి మడమ తిప్పని మాట తప్పని నేత అన్నారని కానీ ఆయనకి మడమ లేదని లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అమరావతిని మార్చకూడదని ఆయన తెలియజేశారు. రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతులు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నమ్మి రాజధాని కోసం భూములు ఇచ్చిన విషయాన్ని నేడు జగన్మోహన్రెడ్డి తప్పుగా చూడకూడదని  వారి త్యాగం గుర్తించకుండా వారిని రోడ్డుపాలు చేయడం అన్యాయమన్నారు.

మాజీ మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలియజేశారు. రాజధాని విషయంలో ఆయన తప్పటడుగులు వేస్తే ప్రజల చేతిలో తనకు రాజకీయ పతనం ప్రారంభం అవుతుందని ఆయన తెలియజేశారు.

ఆప్ పార్టీ నేత నరాల రమేష్ మాట్లాడుతూ రాజధాని విషయంలో వీసాల ఉద్యమం చేయాలని అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కమిటీలు మెంటల్ హాస్పిటల్ లో వచ్చిన కమిటీలు గా ఉన్నాయని తెల్ల కాగితాలు మీద జగన్మోహన్ రెడ్డి ఆ కాగితం మీద రాసి ఉన్నారని ఆయన అన్నారు.

జగన్ కి చంద్రబాబు మీద కోపం ఉంటే ఇద్దరూ మల్లయుద్ధం చేసుకోవాలని అంతేగాని ఐదు కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లో టిడిపి సభ్యులు శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు ,మాజీ శాసనసభ్యులు చిక్కాల రామచంద్రరావు ,గొల్లపల్లి సూర్యరావు ,దాట్ల బుచ్చి రాజు ,జ్యోతుల నెహ్రూ ,ఆదిరెడ్డి అప్పారావు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

మార్కెట్ కమిటీల కాలపరిమితి పెంపు

Sub Editor 2

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

Satyam NEWS

గుర్రం ఎక్కిన బాలయ్య

Satyam NEWS

Leave a Comment