37.2 C
Hyderabad
April 26, 2024 19: 14 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

#daggubatibaburao

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో డి ఆర్ ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. డి ఆర్ ఎస్ ట్రస్ట్ చైర్మన్,మాల మహానాడు హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి బాబురావు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలందరికీ సమన్యాయం, హక్కులు కల్పించిన ఆర్థికవేత్త,న్యాయ కోవిదుడు,రాజనీతిజ్ఞుడు,భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనం,వివక్షతలపై అలుపెరుగని పోరు చేసిన భారతరత్న డా. బి.ఆర్.అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన మార్గంలో నడవాలని,ఉన్నతమైన మన భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు.

సంఘ సంస్కర్తగా,శాస్త్రవేత్తగా కీర్తి గడించిన డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్  1956 డిసెంబర్ 6వ, పరమపదించారని,నేటికీ ఆయన మరణించి 66 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ మహానుభావుడిని ప్రతి ఒక్క భారతీయుడు గుర్తుంచుకోదగిన విషయమని బాబురావు అన్నారు.భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన సందేశాన్ని పాటిద్దామని,భారత పౌరులుగా జీవిస్తూ స్వార్థ భావాలను వీడి ఫలితాలను పంచుకుంటూ కులమత బేధాలు లేకుండా,బడుగు బలహీన వర్గాలను కలుపుకుని జాతి భవితకు అంకితం అవుదామని సందేశం ఇచ్చారు        దగ్గుపాటి బాబురావు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

శతాధిక వృద్ధుని మృతి

Bhavani

సారీ రోశయ్య గారూ… మిమ్మల్ని మర్చిపోయాం….

Satyam NEWS

హైదరాబాద్ లో రేవ్ పార్టీ

Sub Editor 2

Leave a Comment