40.2 C
Hyderabad
April 26, 2024 12: 32 PM
Slider ప్రత్యేకం

తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 సీట్లను గెలుస్తుంది

#amithsha

నిర్మల్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం..!

2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119 సీట్లు గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా..సభకు హాజరైన అందరి చేత భారత్ మాతాకీ జై ,అని వందేమాతరం  అనండని కార్యకర్తల్లో జోష్ నింపారు. సెప్టెంబర్ 17 వ తేదీన హైదరాబాద్ విమోచన దినమని ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు… మరాఠా వరకు వాయిస్ వినిపించాలని అమిత్ షా అన్నారు.

ఇవాళ తెలంగాణ కు స్వాతంత్ర్యం వచ్చిన రోజని అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.. అమిత్ షా.అలాగే ఇవాళ మోడీ జన్మదినం కూడాను..దేశవ్యాప్తంగా 130 కోట్లమంది మోడీ కోసం ప్రార్థన చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 17న  నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ కు స్వేచ్ఛ లభించిన రోజు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 2023లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం గా జరుపుతామి స్పష్టం చేసారు.

ఎంఐఎం కు భయపడేవాళ్ళు భయపడతారేమో… బీజేపీ ఏ ఒక్కరికీ భయపడదన్నారు. నాడు నిజాం పాలనలో ఇదే నిర్మల్ లో 1000 మందిని  ఉరితీశారు… ఇది గుర్తుకు రావడంలేదా కేసీఆర్ కు అని అమిత్ షా ప్రశ్నించారు. ఆ 1000 మంది అమరుల త్యాగాన్ని వృధా కానివ్వమని ఖచ్చితంగా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేసారు.. అమిత్ షా.

ఇక బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రజల కోసమే మొదలు పెట్టారన్నారు. ప్రజల కోసం, ఆదివాసీల కోసం, తెలంగాణ కోసం, అందరికోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  బండి పాదయాత్ర చేస్తున్నారని అమిత్ షా తెలిపారు.ఎంఐఎం కు వ్యతిరేకంగా… అవినీతికి వ్యతిరేకంగా బండి పాదయాత్ర చేస్తున్నారని అమిత్ షా అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటల ను ఎలా పక్కన బెట్టాడో మనకి తెలుసునని అమిత్ షా అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనే తప్ప ఇంకేమీ లేదని అయ్య, కొడుకు, కూతురు(పితాజీ, నేత, బేటీ)మాత్రమే పాలిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. తెలంగాణ లో టీఆర్ ఎస్  ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదన్నారు. కారు కేసీఆర్ ది…. కానీ దాని స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందన్నారు..

అమిత్ షా. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా మీకు ఒక మాట ఇస్తున్నానని 2023 లో తెలంగాణ రాష్ట్రం లో119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేమేంటో చూపిస్తామని అన్నారు.ఏ ఎన్నికైనా డబ్బుతో గెలవొచ్చని టీఆర్ఎస్ అనుకుంటోందని మనమేంటో చూపిద్దామని అమిత్ షా అన్నారు.

Related posts

మరో ధర్మాసనానికి సీఆర్‌డీఏ రద్దు చట్టంపై సుప్రీం విచారణ

Satyam NEWS

అస్వస్థతకు గురైన సినీ నటుడు ప్రభు

Satyam NEWS

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు క్రీడా ప్రాంగణాలు లేకపోతే గుర్తింపు రద్దు

Satyam NEWS

Leave a Comment