38.2 C
Hyderabad
April 29, 2024 19: 40 PM
Slider ప్రత్యేకం

జగనన్న నిరాదరణ: తీవ్ర ఆవేదనలో షర్మిల

#yssharmila

ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు కానీ సొంత అన్న నుంచి కనీసం పలకరింపు కూడా లేకపోవడంతో వై ఎస్ షర్మిల తీవ్ర ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. అన్నా చెల్లీ మధ్య అగాధం ఏర్పడి ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి కానీ ఇంత పెద్ద స్థాయిలో ఒకరితో ఒకరు మాట్లాడుకోనంత వైరం ఉందని ఎవరూ నమ్మలేదు.

గత కొద్ది రోజులుగా వై ఎస్ షర్మిల తెలంగాణ పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష కారణంగా లో బీపి ,బలహీనత,మైకం ఉండటం తో అపోలో ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయ్యారు.

ఆమెకు డీహైడ్రేషన్,ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ఆమెకు తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ మరియు ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఆమె 2-3 వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇంత తీవ్రత ఉన్నా కూడా అన్న నుంచి ఫోన్ రాలేదు.

హత్యకు గురైన చిన్నాన్న వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఆమెకు వైద్యం అందించారు కూడా. తల్లి విజయలక్ష్మి షర్మిలతోనే ఉంటున్నారు. ఇలా కుటుంబం మొత్తం షర్మిలకు అండగా ఉన్న సమయంలో సొంత అన్న అయిన జగన్ మాత్రం కనీసం టెలిఫోన్ లో కూడా పరామర్శించలేదు. రాజకీయంగా కూడా అన్నా చెల్లెలు మధ్య తీవ్ర అగాధం ఏర్పడి ఉన్నది.

రెండు రాష్ట్రాలను కలపడానికే మా ఓటు అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై అనూహ్యంగా.. షర్మిల తీవ్రంగా స్పందించారు. అంతకు ముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై సున్నితంగా చెప్పిన షర్మిల ఇప్పుడు సజ్జల చేసిన వ్యాఖ్యలను తెలంగాణ వారికన్నా ఎక్కువగా ఖండించారు. ముందు రాష్ట్రం గురించి.. రాష్ట్ర ప్రయోజనాల గురించి చూసుకోవాలని షర్మిల సలహా ఇచ్చారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని నేరుగా హెచ్చరికలు పంపారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివన్నారు. నేడు తెలంగాణ ఒక వాస్తవం అని గుర్తు చేశారు. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని.. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యమని స్పష్టం చేశారు.

కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని.. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద అని హితవు పలికారు. మీ హక్కుల కోసం పోరాటం చేయండి.. మీ ప్రాంతానికి న్యాయం చేయండన్నారు. షర్మిల స్పందన చూసిన తర్వాత సోషల్ మీడియాలో సజ్జలపై చాలా సెటైర్లు పడుతున్నాయి.

ముందు తెలుగు రాష్ట్రాలను కాదని.. జగన్, షర్మిలను కలపాలని ఆయనకు సూచిస్తున్నారు. అటు జగన్‌కు..ఇటు జగన్ ఫ్యామిలీ మధ్యలో సజ్జల అడ్డుగోడలా ఉన్నారని చాలా కాలంగా ఆరోపణలు వస్తన్నాయి. ఇప్పుడు ఈ విషయం లో ఆయనపై సెటైర్లు పడుతున్నాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో మరి !

Related posts

అద్దెపల్లి ఫణిభూషణ మంగాచార్యులకు అరుదైన గౌరవ సత్కారం

Satyam NEWS

లా కారిడార్: హైకోర్టులో జగన్ సర్కార్ పిల్లిమొగ్గ

Satyam NEWS

తిరుపతి భూకబ్జాదారులకు ప్రొఫెసర్ భూమన్ వార్నింగ్

Satyam NEWS

Leave a Comment