38.2 C
Hyderabad
May 3, 2024 19: 49 PM
Slider సంపాదకీయం

మరో కుంపటి: ఎమ్మెల్యే వంశీ పై పోటీకి వైసీపీ నేత యార్లగడ్డ సై

#vallabhanenivamshi

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అంతే కాదు అధికార పార్టీ వైసీపీలోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న పలు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఎన్నికల వేళ బయటపడుతున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నీ ఇప్పుడు స్వరం పెంచుతున్నాయి.

అయితే వైసీపీ టికెట్ పై పోటీ చేస్తాం లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లా రామచంద్రపురం టికెట్ కోసం వైసీపీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకూ, అదే పార్టీకి చెందిన రాజ్యసభఎంపీ, సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే రామచంద్రపురంలో వేణుకు టికెట్ ఖరారు చేయడంతో ఆగ్రహంగా ఉన్న పిల్లి.. తాను లేదా తన కుమారుడు అయితే వైసీపీ టికెట్ మీద లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతామంటున్నారు. అంతే కానీ మంత్రి వేణుకు మద్దతిచ్చేది లేదంటున్నారు.

ఇప్పుడు ఇదే సీన్ గన్నవరం నియోజకవర్గంలోనూ రిపీట్ అయింది. గన్నవరంలో టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి అనుబంధంగా ఉంటున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జగన్ ఎప్పుడో టికెట్ ఖరారు చేసేశారు. అయినా ఆయనకు ప్రత్యర్ధులుగా ఉన్న వైసీపీ పాత వర్గం దుట్టా రామచంద్రరావు, గత ఎన్నికల్లో పోటీ చేసి వంశీ చేతిలో ఓడిన యార్లగడ్డ వెంకట్రావు తమకూ టికెట్ కావాలంటున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు మరోసారి పోటీ కోసం సిద్ధమవుతున్నారు. వంశీకి కాకుండా తనకు గన్నవరం టికెట్ కావాలంటున్న ఆయన.. రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానంటున్నారు.

టీడీపీకి వెళ్తానన్న ప్రచారాన్ని మాత్రం ఆయన  ఖండించారు. దీంతో ఇప్పుడు సిట్టింగ్ వంశీకి టికెట్ ఇవ్వాలా లేక గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావుకు ఇవ్వాలా అన్న దానిపై జగన్ కు సందిగ్ధం ఏర్పడుతోంది. అయితే ఇప్పటికే వంశీకి టికెట్ పై హామీ ఇచ్చిన జగన్ దాన్ని వెనక్కి తీసుకునే పరిస్దితి లేదు. కాబట్టి యార్లగడ్డను త్వరలో పిలిపించి మాట్లాడేందుకు సిద్దమవుతున్నారు. జగన్ తో భేటీలో ఆయన ఒప్పుకోకపోతే ఆ తర్వాత ఇక బుజ్జగించకుండా వదిలేసే అవకాశాలూ లేకపోలేదు.

దీంతో యార్లగడ్డ కూడా వచ్చే ఎన్నికల కోసం తన వ్యూహాలు తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా వుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో మినహా మిగిలిన 12 నియోజక వర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే టీడీపీ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ అనధికారికంగా వైసీపీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ సారి కృష్ణా జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకానున్నాయి.

పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అంతే గాకుండా వైసీపీ పట్ల ప్రజల్లో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. దీంతో ఓటమి తప్పదని గ్రహించిన ఎమ్మెల్యే లు కొందరు దీపం వుండగానే ఇల్లు చక్క బెట్టుకోవలన్న చందాన ప్రధాన రాజకీయ పక్షమైనలో సీటు పదిలం చేసుకోవడానికి పావులు కదుుతున్నారు. గన్నవరంతో కృష్ణా జిల్లా వైసీపీలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నాయి.

Related posts

కొల్లాపూర్ ఎంపిడిఓ కార్యాలయ పరిధిలోని సెటర్లకు ఓపెన్ టెండర్ నిర్వహించాలి

Satyam NEWS

అమీర్ పేట్  గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రికి మహర్దశ

Satyam NEWS

పాత పథకానికి కొత్త పేరు పెట్టుకున్న సీఎం జగన్

Satyam NEWS

Leave a Comment