27.7 C
Hyderabad
April 26, 2024 05: 59 AM
Slider ప్రకాశం

రాష్ట్రంలో ఉన్మాద పాలన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి

Gooduri

ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉన్మాదం పెరిగింది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. టిడిపి సీనియర్ నాయకులు కళావెంకట్రావుని రాత్రి పూట ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లుగా చెయ్యడం చాలా దుర్మార్గ‌మ‌న్నారు. ఒక బి.సి నేతపై తప్పుడు కేసులు పెట్టి వేధించటం పోలీసులు చట్టాన్నిదుర్వినియోగం చేయటం తగదు అని ఎరిక్షన్ బాబు అన్నారు. రామతీర్ధంలో రాముని తల తీసేసిన వారిని పోలీసులు ప్రభుత్వం పట్టించుకోకుండా చట్టాన్ని గాలికి వదిలేసి కళావెంకట్రావుని అక్రమ నిర్బంధం చెయ్యడం ఇది జగన్ మోహన రెడ్డి ప్రభుత్వ ఉన్మాద చర్య అని ఎరిక్షన్ బాబు అన్నారు.

ఎవరో ఖాళీ బాటిల్ కారు పై విసిరితే హత్యాయత్నకేసు నమోదు చెయ్యడం పోలీసుల‌ దుశ్చర్య అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు మారాలి. దేవాలయలపై దాడుల‌ను ఖండిస్తే అరెస్టులు చేస్తారా? అన్యాయాన్నిప్రశ్నించిన ప్రజలను ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతిచ్చి మరలా రద్దుచేయడం అనేది ప్రజా స్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. పోలీసుల పహరాలో రాష్ట్రం ఉంది ప్రజలు భయంగా బ్రతుకుతున్నారు. శాంతి భద్రతలు లోపించాయ్ అని ఎరిక్షన్ బాబు జగన్ మోహన రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థ పై ప్రజలకు నమ్మకాన్నికలిగించే విధంగా పాలనలో మార్పులు తీసుకుని రావలసిందిగా డిజిపిని కోరుకుంటున్నాను అని గూడూరి ఏరిక్షన్ బాబు తెలిపారు.

Related posts

4న తెలంగాణా కాంగ్రేస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ

Sub Editor 2

పరీక్షలు రాయకుండానే పాస్ చేసిన సీబీఎస్ఈ

Satyam NEWS

భాగ్యనగరంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో నిరసన

Satyam NEWS

Leave a Comment