33.7 C
Hyderabad
April 29, 2024 02: 55 AM
Slider వరంగల్

ఓటరు నమోదు కార్యక్రమం మన సామాజిక బాధ్యత

#mulugucollector

ఓటు హక్కును సామాజిక బాధ్యతతో నమోదు చేయించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య అన్నారు. మంగళవారం రోజున కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన అవగాహన సమావేశ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటిదని, దానిని దుర్వినియోగం చేయరాదన్నారు. భారత ఎన్నికల కమిషన్ నూతనంగా పంపించిన ఫారం 6,6A,6B,7,8 లపై ప్రజాప్రతినిధులకు నూతనంగా ఓటు హక్కును ఏ విధంగా పొందాలి ? అనేదానిపై అవగాహన కల్పించారు.

ఫారం 6 ఓటరు నమోదు కొరకు

ఫారం 6A. విదేశాల నుండి వచ్చిన నూతన ఓటు హక్కును పొందే వారికి

ఫారం 6B ఆధార్ అనుసంధానం, ఆధార్ కార్డు సంఖ్య యొక్క సమాచారం

ఫారం 7. ప్రతిపాదిత పేరును చేర్చడం లేదా తొలగించడం.

ఫారం 8. ప్రస్తుత ఓటరు జాబితాలో నివాస మార్పు, దిద్దుబాటు లేకుండా కొత్త ఎపిక్ జారీ చేయడం కోసం, ఓటరు జాబితాలో సవరణల కోసం, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం కొరకు ఉన్నాయి.

భారత ఎన్నికల కమిషన్ గరుడా యాప్ ద్వారా సంబంధిత B.L.O లకు ఆగస్టు 1.2022 నుండి మార్చ్ 31 2023 లోగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ (రెవెన్యూ) కలెక్టర్ వై వి గణేష్, డి ఆర్ ఓ. రమాదేవి, జిల్లా ఎలక్షన్ కమిషన్ మాస్టర్ ట్రైనర్ విజయ్ కుమార్ మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

కర్నాటకలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు

Satyam NEWS

లక్నోలో హిందూ మహాసభ అధ్యక్షుడి హత్య

Satyam NEWS

కార్యదర్శులకు అదనపు బాధ్యతలు

Sub Editor 2

Leave a Comment