28.7 C
Hyderabad
April 26, 2024 09: 55 AM
Slider జాతీయం

ఒడిశా పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర సభ్యుడు..!

#koraputpolice

మావోయిస్టు అగ్ర‌నేత, ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ స‌బ్యుడు, మిల‌ట‌రీ క‌మీష‌న్ చీఫ్ దుబాసీ శంక‌ర్ అలియాస్ మ‌హేంద‌ర్ అలియాస్ అరుణ్ అలియాస్ ర‌మేష్ లొంగిపోయినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. ఏఓబీలోని బోయిపరిగూడ పీఎస్ పరిధిలోని పేటగూడ మరియు నోరో గ్రామ అటవీ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తున్న డీవీఎఫ్‌, ఎస్‌వోజీ, బీఎస్ ఎఫ్ బ‌ల‌గాల‌కు  మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు.

ఈ క్ర‌మంలో ఇరువైపులా పోలీసుల‌కు మావోయిస్టుల‌కు పోలీసుల‌కు మ‌ద్య ఎదురుకాల్ప‌లు జ‌రిగాయి. ఈ క్రమంలో నే మావోయిస్టు సీనియ‌ర్ నేత‌, ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ స‌బ్యుడు దుబాసీ శంక‌ర్  ఇన్సాస్ తుపాకీతో పోలీసుల‌కు లొంగిపోయారు. దీంతో అత‌న్ని అదుపులోకి తీసుకుని అత‌ని వ‌ద్ద నుంచి శాంసంగ్ మొబైల్ ఫోన్‌, రేడియో, 35 వేల న‌గ‌దు స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

అతను  1987 ఏడాది లో మావోయిస్టు  పార్టీలో  ఇంద్ర‌పురియ‌ల్ ఏరియా క‌మిటీ స‌భ్యునిగా చేరి 2003లో ప‌దోన్న‌తిపై  ఏవోబీ బ‌దిలీపై వ‌చ్చారు. ఏవోబీ జోన‌ల్ క‌మిటీ స‌బ్యునిగా విధులు నిర్వ‌హిస్తుండ‌గానే, 2010లో మిల‌టరీ క‌మీష‌న్ చీఫ్‌గా ప‌దోన్న‌తి ల‌భించింది. ప్ర‌స్తుతం మిల‌టరీ క‌మీష‌న్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

ఇత‌నిపై కోరాపుట్ లో రెండు, మ‌ల్క‌న్‌గిరిలో 18 కేసులు న‌మోదుగా కాగా, విశాఖ జిల్లా 32, తెలంగాణా రాష్ట్రంలో 24 కేసులు న‌మోదయ్యాయి. ప్ర‌స్తుతం ఇత‌నిపై రూ.20 ల‌క్ష‌లు రివార్డును కూడా పోలీసులు ప్ర‌క‌టించారు. అదేవిధంగా పెద‌బ‌య‌లు ఏరియా క‌మిటీ స‌బ్యుడు   మాధవి సోనాలి అలియాస్ కిరణ్ కూడా పోలీసులకు లొంగిపోయాడు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

తిరుపతిలో రోజు రోజుకూ మారుతున్న రాజకీయం

Bhavani

క్రీడారంగంలో ప్రభుత్వ సదుపాయాలు ఉపయోగించుకోవాలి

Satyam NEWS

అవగాహనే ‘ఎయిడ్స్ నివారణ’కు మందు

Bhavani

Leave a Comment