మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ కూటమి పార్టీలే లీడింగ్‌లో ఉన్నాయి. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి సుమారు 211 సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక హర్యానాలో బీజేపీకి 66 సీట్లు దక్కుతాయన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లుతున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
previous post