37.2 C
Hyderabad
April 26, 2024 21: 28 PM
Slider ముఖ్యంశాలు

నీలాచలం కొండకు భారీ ర్యాలీ కోసం బీజేపీ ప్రణాళిక

#RamateerdhamHill

విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన ఘటనతో మరింత ప్రాచుర్యం పొందింది. ఓవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ.. ఇంకో వైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ చేస్తున్న అలజడులతో నీలాచలం కొండ బాగానే ప్రసిద్ధి గాంచింది.

గత అయిదు రోజుల నుంచీ కొండపై జరిగిన ఘటనను అటు టీడీపీ ఇటు అధికార పార్టీ తమకనుకూలంగా మార్చుకున్న దరిమిలా బీజేపీ కూడా తమ పార్టీ కి అనుకూలంగా మార్చుకునే యత్నాలు ప్రారంభించింది. ఈ తరుణంలో నే జనసేన తో కలిసి నీలాచలం కొండ వద్దకు ర్యాలీగా బయలుదేరనుంది.

ఇదే విషయాన్ని ఉత్తరాంధ్ర బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్…మీడియా సమావేశం పెట్టి మరీ ప్రజలకు తెలియ చేసారు.ఈ మేరకు పోలీసులకు కూడా ఒక రోజు ముందు గానే తెలియ చేసారు. దీంతో జిల్లా ఎస్పీ అత్యవసరం గా సర్కిల్ స్థాయి అధికారులతో సమావేశమై బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే రామతీర్థం వద్ద నీలాచలం కొండ ప్రాంతాన్ని పోలీసులు తమ పరిధిలోకి తీసుకున్నారు.ఇప్పటికే దిశ డీఎస్పీ త్రినాథ్ కొండ ప్రాంతాన్ని పరిశీలించారు. కొండపై పది మంది కొండ దిగువన ఇరవై మంది బందోబస్తుగా పెట్టారు.

అటు ఏఆర్ సిబ్బంది ఇటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ఇద్దరు ఎస్ఐలతో బందోబస్తుగా జిల్లా ఎస్పీ సిధ్ధౌ చేసారు. ఏదైనా ఈ నెల 5న బీజేపీ-జనసేనల బైక్ ర్యాలీ ధర్నాలతో మరోసారి నీలాచలం కొండ మీడియా కు ఎక్కనుంది.

Related posts

ఏప్రిల్ 5 ఛలో ఢిల్లీ… సీఐటీయూ పిలుపు…!

Satyam NEWS

తిరుగుబాటు ఎంపి రఘురామపై విష ప్రయోగం జరిగిందా?

Satyam NEWS

ఏపీ పోలీసుల్ని పరుగులు పెట్టించిన తెలంగాణ వాసులు

Satyam NEWS

Leave a Comment