33.7 C
Hyderabad
April 29, 2024 02: 09 AM
Slider ప్రత్యేకం

వివేకా హత్య కేసులో సీబీఐ మధ్యంతర చార్జిషీటు

#Y S Vivekanandareddy

ఎపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీబీఐ మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సమాచారం. సీబీఐ ఛార్జిషీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యంతర ఛార్జిషీటులో సీఎం జగన్, అవినాష్ రెడ్డి పేర్లు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తునకు మరింత గడువు కావాలని జులై 3వ తేదీనే సుప్రీంకోర్టును కోరాలని సీబీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జులై 3న సీజేఐ ధర్మాసనం ముందు అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది.

ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తు వివరాలన్నింటినీ సీబీఐ ఛార్జిషీటులో ప్రస్తావించనుంది. కుట్రకోణం వెలుగులోకి తెచ్చేందుకు మరింత గడువు కావాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరనుంది. వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి   సీబీఐ  విచారణకు హాజరవుతున్నారు. సీబీఐ ఆదేశాల మేరకు  కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్‌  డాక్యుమెంట్స్‌తో సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

జూన్ నెలాఖరు వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం అవినాష్‌కు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు సీబీఐ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా ఇప్పటికే అవినాష్ ముందోస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Related posts

నకిరేకల్ లో యూరియా కొరతను నివారించాలి

Satyam NEWS

10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS

వేద,స్మార్త విద్యపై మక్కువతో శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు భూరి విరాళం

Satyam NEWS

Leave a Comment