40.2 C
Hyderabad
April 26, 2024 14: 00 PM
Slider ముఖ్యంశాలు

ఉత్తరాంధ్ర లో టీడీపీ అధినేత 3 రోజుల రోడ్ షో షెడ్యూల్ ఇదే…!

#chandrababu

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆ పార్టీ నేత మాజీ ఎంపీ కంభంపాటి  రామ మోహన్ రావు ఈ వివరాలు వెల్లడించారు. చంద్ర బాబు ఈ నెల 22వ తేదీన విజయవాడ నుంచి విమానంలో విశాఖ కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తొలి రోజు రాజాం, మరుసటి రోజు బొబ్బిలి, మూడో రోజు విజయనగరంలో పర్యటిస్తారు.

టూర్ షెడ్యూల్ ఇదే

ఈ నెల 22వ తేదీ  సాయంత్రం 6 గంటలకు రాజాంలో రోడ్ షో అనంతరం చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ నుంచీ అంటే 09.30కి రాజాం తృప్తి రిసార్ట్స్ లో బస చేస్తారు. ఆ మర్నాడు అంటే 23 వ తేదీన ఉదయం 11 నుంచి 12.30 వరకు ఓబీసీ లీడర్లతో తృప్తి రిస్సార్ట్స్ లో ముఖాముఖి అవుతారు. అక్కడ నుంచి

మధ్యాహ్నం 2 గంటలకు పెరుమాలి నుంచి బయలుదేరి, 4.30కి బొబ్బిలి లోని గొల్లపల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్ షో గా 5.30కి చర్చ్ సెంటర్ వద్ద కు చేరుకుని సాయంత్రం 6.30 కి బొబ్బిలిలోని  పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. రాత్రికి 9.30కి బొబ్బిలి ప్యాలస్ లోనే  బస చేస్తారు.

ఆ మర్నాడు అంటే 24 వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.12.15 వరకు బొబ్బిలి ప్యాలస్ లో రైతులతో చంద్రబాబు ముఖాముఖి అవుతారు. 24వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు బొబ్బిలి ప్యాలస్ నుంచి బయలుదేరి రామభద్ర పురం, గజపతినగరం మీదుగా 4.30కి విజయనగరం ద్వారపూడి చేరుకుంటారు. అక్కడ నుంచి కెఎల్ పురం, వెంకటలక్ష్మి థియేటర్ కూడలి, గంట స్తంభం మీదుగా కోట జంక్షన్ వద్దకు రోడ్ షో గా వెళ్లనున్నారు. 

సాయంత్రం 6 గంటలకు విజయనగరం  కోట జంక్షన్ వద్ద పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 7.30 వరకు మీటింగ్ లో మాట్లాడి, 9.30 గంటలకి విశాఖ చేరుకుంటారు. అక్కడ  ప్రత్యేక ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇక రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షో అండ్ పబ్లిక్ మీటింగ్స్ ఉండనున్నాయి.

Related posts

డెత్ హంటర్స్: విద్యుదాఘాతానికి ఎంపీటీసీ బలి

Satyam NEWS

స్వచ్ఛ గ్రామాలలో పెద్దపల్లి జిల్లా ఆదర్శం

Satyam NEWS

గాంధీ నగర్ లక్ష్మీ గణపతి ఆలయానికిఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

Leave a Comment