40.2 C
Hyderabad
April 26, 2024 11: 15 AM
Slider నల్గొండ

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

#HujurnagarMunicipality

మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని లేదా అప్పటి వరకు నెలకు ఇరవై నాలుగు వేల రూపాయలు వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నాగిరెడ్డి కి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను వెట్టిచాకిరి నుండి విముక్తి కలిగించాలని కోరారు.

రాష్ట్రంలో 36000 మంది మున్సిపల్ కార్మికులు, జిహెచ్ఎంసి పరిధిలో 28000 మంది మొత్తం 64000 మంది కార్మికులను పర్మినెంట్ చేసి సుదీర్ఘ వెట్టిచాకిరి నుండి వారిని విముక్తి చేయాలని కోరారు.

2016 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఉధృత పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు యలక సోమయ్య గౌడ్, మున్సిపల్ కార్మికులు, ఎంప్లాయిస్ యూనియన్ [CITU అనుబంధం] అధ్యక్ష్య, కార్యదర్శులు, కస్తాల ముత్తమ్మ, దుర్గారావు, మాతంగి, రమణ, కృష్ణ, గోపి, సైదులు, సైదమ్మ, గురవమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఫైనాన్సర్

Satyam NEWS

తెలంగాణ జాగృతి పట్టణ మహిళా కన్వీనర్ గా షేక్ రహీమా

Satyam NEWS

వరద ప్రాంతాల రైతుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

Satyam NEWS

Leave a Comment