37.2 C
Hyderabad
April 26, 2024 22: 01 PM
Slider నల్గొండ

రెయిన్ డే: ముందస్తు జాగ్రత్తలకు ప్రజలు సిద్ధం కావాలి

#Chirumarthy Lingaiah

వచ్చే వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలు ముందస్తుగా ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకోవాలని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ వర్గం చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు ప్రతి ఒక్కరు వారి ఇంట్లో, పరిసరాలల్లో, వీధుల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి, అవసరమైన పరిస్థితి లో మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని అన్నారు.

నీటి నిల్వ కారణంగా దోమలు పెరిగి డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి రోగాలకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇంటి పరిసరాలు మురికి నీరు, పిచ్చి మొక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.చిట్యాల మున్సిపల్ కార్పోరేషన్ లో పనిచేస్తున్న కార్మికులు కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహాయం అందించి స్ఫూర్తిగా నిలిచారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి మున్సిపల్ కార్మికుల విరాళం

కరోనా సమయంలో ప్రజలకు నిత్యం సేవలను అందిస్తున్న కార్మికులు తాము కూడా ప్రభుత్వానికి అండగా నిలవాలని, తాము భాగస్వామ్యం కావాలన్న సంకల్పంతో రూ. 18 వేలను ఆదివారం రోజున ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. 

చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకటరెడ్డి సమక్షంలో పారిశుద్ధ్య కార్మికులు నోముల మరియమ్మ, జడల నర్సిహ్మ, ఊదరి లక్ష్మమ్మ, పోకల శాంతమ్మ, పాల మల్లయ్య, బాకీ అండాలు, బోడ యెట్టమ్మ తదితరులు ఎమ్మెల్యే కు నగదును అందజేశారు.

మునిసిపల్ వర్కర్లకు ఆరోగ్య చికిత్సా శిబిరం

స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ లో పనిచేస్తున్న కార్మికులకు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్షల క్యాంపు ను చిరుమర్తి ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న సమయంలో కార్మికుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం కోవడం క్యాంపు ను ఏర్పాటు చేసినట్లు స్థానిక వైద్యాధికారి డాక్టర్ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, తెరాస పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జడల ఆది మల్లయ్య, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, పందిరి గీత, జిట్టా బొందయ్య, జడల పూలమ్మ చిన్న మల్లయ్య, రెము డాల లింగస్వామి, సిలివేరు శేఖర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ రేముడాల సైదులు, నాయకులు గుండెబోయిన సైదులు, పొన్నం లక్ష్మయ్య, కోమటిరెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోవిడ్ సెంటర్ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలి

Satyam NEWS

గొప్పవారి ఫొటోలు గోడలపై కాదు గుండెల్లో ఉండాలి

Satyam NEWS

బీజేవైఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు

Satyam NEWS

Leave a Comment