28.7 C
Hyderabad
April 27, 2024 06: 30 AM
Slider తూర్పుగోదావరి

అంతర్వేది ఆలయంలో పూజలు చేసిన వై ఎస్ జగన్

#YSJaganCM

తూర్పుగోదావరి జిల్లాలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన అంతర్వేది లో నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం… అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు.  సీఎం వైఎస్ జగన్‌కు  వేదపండితులు ఆశీర్వచనం అందించారు.

స్వామి వారిని దర్శించుకున్న సీఎం.. అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన  ప్రారంభించారు.

40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: సౌమ్యనాథ స్వామి దేవాలయం మూసివేత

Satyam NEWS

డిజిగ్నేషన్ చిన్నదే హృదయం మాత్రం ఎంతో పెద్దది

Satyam NEWS

మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన చెల్లెలు కవిత

Satyam NEWS

Leave a Comment