28.7 C
Hyderabad
April 27, 2024 04: 17 AM
Slider కడప

ఆర్యవైశ్యులకి సముచిత స్థానం కల్పించింది ముఖ్యమంత్రి జగన్

#siddaraghavarao

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని అగ్ర భాగాన నిలిపింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా బద్వేలు పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య సోదరులతో కలసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మాట్లాడుతూ సమర్ధవంత పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతూ అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలు అభినందనీయమని అన్నారు.

సామాజిక న్యాయం ధ్యేయంగా 76 శాతం ఎస్.సి.ఎస్.టి.,బి.సి.,మైనారిటీలకు పదవులు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది అని అన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్య సోదరులకు కీలక పదవులు ఇచ్చారని అన్నారు. గ్రామ స్వరాజ్యం స్థాపనగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రోల్ మోడల్ అయ్యారని తెలిపారు.

ఆర్యవైశ్య సోదరులు అంకితభావంతో పని చేసి బద్వేలు ఉప ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కడప ఎమ్.పి.అవినాష్ రెడ్డి,ఎమ్.ఎల్.సి.గోవింద రెడ్డి, నంద్యాల ఎమ్.ఎల్.ఏ.శిల్ప రవి చంద్ర రెడ్డి,రాష్ట్ర పర్యావరణ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నెల్లూరు ఆర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్కాల ద్వారక,మునిసిపల్ వైస్ చైర్మన్ సాయి,కె.వి.సుబ్బారావు, టీటీడీ బోర్డ్ సభ్యులు మారుతి.ప్రసాద్, కరుణాకర్,రాజ్ గోపాల రెడ్డి,బద్వేలు ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Bhavani

తిరుపతి అసెంబ్లీ సీటుపై జనసేన ఆసక్తి: బరిలో హరిప్రసాద్

Satyam NEWS

కొల్లాపూర్ టీఆర్ఎస్ నేత అనుచరుల దాడిలో ఒకరి మృతి: ఉద్రిక్తత

Satyam NEWS

Leave a Comment