42.2 C
Hyderabad
April 26, 2024 18: 44 PM
Slider జాతీయం

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ పై కసరత్తు

parliament-staff-corona

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో 400 మందికి పైగా సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 31 నుంచి జరగాల్సిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై సందిగ్ధత నెలకొంది.

ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కసరత్తు నిర్వహిస్తోంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయించాలంటూ ఉభయ సభల సెక్రటరీ జనరల్స్‌కు ఇరు సభాపతులు ఆదేశించారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో తొలుత ఫోన్లో మాట్లాడి అనంతరం సెక్రటరీ జనరల్‌కు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాలిచ్చారు.

కోవిడ్-19 ప్రొటోకాల్ అమలుపై సమీక్ష అవసరమని లోక్‌సభ, రాజ్యసభ సభాపతులు భావించారు. గత శీతాకాల సమావేశాల్లోనూ ఉభయ సభలు కోవిడ్-19 నిబంధనలను కఠినంగా అమలు చేశాయి. 2020లో పూర్తిస్థాయి కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి, ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం తర్వాత లోక్‌సభ నిర్వహించాయి. సభా సమయంలో ఉభయ సభలు, పబ్లిక్ గ్యాలరీలో ఎంపీలను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ పూర్తిగా అమలు చేశారు.  2021 బడ్జెట్ సెషన్ తొలి అర్థభాగంలోనూ ఇదే పద్ధతి అమలు చేశారు. ఆ తర్వాత జరిగిన సెషన్లలో సాధారణ పద్ధతిలో ఉభయ సభలు ఏకకాలంలో జరిగాయి. అయితే ఆయా సభల్లో పబ్లిక్ గ్యాలరీలోనూ సభ్యులను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ అమలు చేశారు. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఏ పద్ధతిలో నిర్వహించాలన్న అంశంపై సమీక్ష జరిపి నిర్ణయించాలని సెక్రటరీ జనరల్స్‌కు ఉభయ సభాపతులు ఆదేశాలిచ్చారు.

పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 31 నుంచి జరగాల్సిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై సందిగ్ధత నెలకొంది.

ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కసరత్తు నిర్వహిస్తోంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయించాలంటూ ఉభయ సభల సెక్రటరీ జనరల్స్‌కు ఇరు సభాపతులు ఆదేశించారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో తొలుత ఫోన్లో మాట్లాడి అనంతరం సెక్రటరీ జనరల్‌కు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాలిచ్చారు.

కోవిడ్-19 ప్రొటోకాల్ అమలుపై సమీక్ష అవసరమని లోక్‌సభ, రాజ్యసభ సభాపతులు భావించారు. గత శీతాకాల సమావేశాల్లోనూ ఉభయ సభలు కోవిడ్-19 నిబంధనలను కఠినంగా అమలు చేశాయి. 2020లో పూర్తిస్థాయి కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి, ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం తర్వాత లోక్‌సభ నిర్వహించాయి. సభా సమయంలో ఉభయ సభలు, పబ్లిక్ గ్యాలరీలో ఎంపీలను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ పూర్తిగా అమలు చేశారు.  

2021 బడ్జెట్ సెషన్ తొలి అర్థభాగంలోనూ ఇదే పద్ధతి అమలు చేశారు. ఆ తర్వాత జరిగిన సెషన్లలో సాధారణ పద్ధతిలో ఉభయ సభలు ఏకకాలంలో జరిగాయి. అయితే ఆయా సభల్లో పబ్లిక్ గ్యాలరీలోనూ సభ్యులను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ అమలు చేశారు. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఏ పద్ధతిలో నిర్వహించాలన్న అంశంపై సమీక్ష జరిపి నిర్ణయించాలని సెక్రటరీ జనరల్స్‌కు ఉభయ సభాపతులు ఆదేశాలిచ్చారు.

Related posts

గ్యాస్ లీక్ ప్రమాదాన్ని గోప్యంగా ఉంచుతున్నారు

Satyam NEWS

రాహుల్ గాంధీ కి ముఖ్యమంత్రి కెసీఆర్ సంఘీభావం

Satyam NEWS

కువైట్, ఖతార్ లో మాస్క్ లేకపోతే మూడు నెలల జైలు

Satyam NEWS

Leave a Comment