38.2 C
Hyderabad
April 28, 2024 22: 46 PM
Slider ముఖ్యంశాలు

శాసన సభ ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టిన కోలగట్ల

#kolagatla

ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతిగా ఎన్నికైన విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టారు. అమరావతిలోని ఆంద్రప్రదేశ్ శాసన సభ భవనంలో  వారికి కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తదుపరి ఆయన  ఈ బాధ్యతలను చేపట్టారు.

ఉప సభాపతిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలువురు మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు ఆయన పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.  శాసన సభ సమావేశంలో కోటగట్ల వీరభద్రస్వామి ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన వెంటనే సభాపతి సీటులో వీరు కూర్చొని కొంత సేపు సభను నిర్వహించడంతోనే వీరు ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది.

అయితే ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టే అధికార ప్రక్రియను  ఆయనకు కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన పూర్తిచేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ సీఎం జగన్ తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచి ఎంతో గురుతరమైన బాధ్యతను తనకు అప్పగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

వారి నమ్మకాన్ని ఏ మాత్రం ఒమ్ముచేయకుండా తనకు అప్పగించిన గురుతర బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ శాసన సభా సమావేశాలు సజావుగా సాగే విధంగా తన శక్తి వంచనలేకుండా కృషిచేస్తానని ఆయన అన్నారు.  అనంతరం డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, ప్రభుత్వ విఫ్ కరణం ధర్మశ్రీ, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు డా.పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణ రాజు, పాకలపాటి రఘు వర్మ, పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు బొత్స అప్పల నర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పల నాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పల నాయుడు, అన్నంరెడ్డి అదీప్ రాజ్,యు.వి.రమణ మూర్తి రాజు, చెట్టి పాల్గుణ తదితరులు శాసన సభ ఉప సభాపతిగా నూతంగా బాధ్యతలను చేపట్టిన కోలగట్ల వీరభద్ర స్వామికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలియజేసారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

రియాక్షన్: తప్పు దిద్దుకుంటున్నారు సంతోషం

Satyam NEWS

పెనుకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం అస్తవ్యస్తం

Bhavani

డిశంబర్ నెలాఖరుకు గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు పూర్తి

Satyam NEWS

Leave a Comment