26.7 C
Hyderabad
April 27, 2024 10: 46 AM
Slider మహబూబ్ నగర్

6 నుండి 13 వరకు గొర్రెలు, మేకలలో సామూహిక నట్టల నివారణ

#live stock

నాగర్ కర్నూల్ జిల్లా లోని మొత్తం 9.7 లక్షల గొర్రెలకు, 2 లక్షల మేకలకు ఆగస్టు 6 నుండి 13 వరకు సామూహికంగా నట్టాల నివారణ మందులు ఇస్తామని జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక అధికారి జి.వి. రమేష్  పేర్కొన్నారు. జిల్లా లోని 20 మండలాలలో మొత్తం 150 మంది సిబ్బంది 47 జట్లగా ఏర్పడి ఈ కార్యక్రమం లో పాల్గొంటారని తెలియ చేశారు. 

గొర్రెల, మేకల శరీరంలో నులిపురుగులు, కార్ఖపు జలగలు,పొట్ట జలగలు ,బద్దే పురుగులు ఉండటం వలన జీవాలు నీరసిస్తాయి. వీటిలో పెరుగుదల మందగించడం, రక్తహీనత , ఎద రాకపోవటం, బలహీనమైన పిల్లలు జన్మించటం, వ్యాధుల బారినపడటం మొదలయినవి సంభవిస్తాయి. జీవాలలో ఒక క్రమ పద్ధతిలో నట్టల నివారణ మందులు త్త్రాపించటం వలన అంతరపరాన్న జీవులు నశించి ఆరోగ్యంగా ఉంటాయి.

ప్రతి గొర్రె ,మేక కనీసం రెండు కిలోల బరువు పెరుగతుంది. వీటిలో ఒకే ఈతలో ఎక్కువ పిల్లలు పుట్టే అవకాశం వుంటుంది. ఇతర అంటు వ్యాధుల సోకే అవకాశాలు తక్కవగా ఉంటాయి. కావున జీవాల పెంపకందార్లు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి మందలకు నట్టల నివారణ మందులు త్రగించుకోవలసినదిగా  విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.

అదే విధంగా అంతర్ పరాన్నజీవులు ఎక్కువగా సోకకుండా మేపులో కూడా జాగ్రత్త వహించాలి. మేపిన ప్రాంతంలోనే మరల మేపకుండ (ratational grazing) చేయాలి, ఇలా చేయటం వలన పరాన్నజీవి జీవిత చక్రం ఆగిపోయి నశిస్తాయి. ఇవే కాకుండా గొర్రెలకు చిటుక వ్యాధి,బోబ్బ రోగం, పారుడు వ్యాధి టీకాలు, మేకలలో బొబ్బ రోగం , పారుడు వ్యాధి టీకాలు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇస్తున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లోని ప్రజా ప్రతినిధులు పాల్గోని వారి విలువైన సలహాలు, సూచనలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామని పశు సంవర్ధక అధికారి తెలిపారు.

Related posts

అపర చాణక్యుడు

Satyam NEWS

మంగళగిరి అసెంబ్లీ స్థానంలో భగ్గుమన్న విభేదాలు

Satyam NEWS

యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ‘చోరుడు’ ఫస్ట్ లుక్ లాంచ్

Bhavani

Leave a Comment