32.7 C
Hyderabad
April 26, 2024 23: 03 PM
Slider నెల్లూరు

ప్రతీకార రాజకీయాల్లోకి కోర్టులను లాగవద్దు

మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటీషన్ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతీకార జకీయాల్లోకి కోర్టులను లాగొద్దని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ నాగరత్నంల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పటి మంత్రి నారాయణపై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ కేసులో నారాయణకు రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌, భూసేకరణలో అనేక మార్పులు చేశారని, విచారణ సంస్థలకు సహకరించడం లేదని ప్రభుత్వ తరఫు లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి తెచ్చినా ముందస్తు బెయిల్‌ ఇచ్చిందని అన్నారు. నిందితులు దర్యాప్తునకు సహకరించకపోతే హైకోర్టునే ఆశ్రయించవచ్చని అంటూ ధర్మాసనం వ్యాఖ్యాలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటీషన్‌ను కొట్టివేసింది.

Related posts

పూతలపట్టు పాల డైరీలో అమ్మోనియా లీక్

Satyam NEWS

తెలుగుదేశం పార్టీని వదిలేయాలనుకున్న కోడెల

Satyam NEWS

కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

Satyam NEWS

Leave a Comment