40.2 C
Hyderabad
April 26, 2024 14: 33 PM
Slider పశ్చిమగోదావరి

కోడి వ్యర్ధాలను తరలిస్తున్న డాన్ ఎవరు?

#fishfeed

ఆగడాల లంక పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువులకు కోడి వ్యర్ధాలను తరలిస్తున్న డాన్ ఎవరు? ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాలలంక గ్రామంలో కొల్లేరులోని చేపల చెరువులకు యథేచ్ఛగా కోడి వ్యర్ధాలను తరలిస్తున్న కంటైనర్లు నిత్యం ఇలా కోడివర్ధాలు తరలించడం వల్ల అక్కడ ప్రజలు త్రాగునీరుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. త్రాగునీరు కలుషితమై వింత వ్యాధికి కారణం అవుతుందేమోనని భయాందోళన చెందుతున్నారు. ఈ తతంగం అంతా ఒక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. వ్యానుకు కొంతమంది యువకులు పైలట్గా వ్యవహరిస్తున్నారు. గ్రామాన్ని సంరక్షించాల్సిన  ప్రజాప్రతినిధిని ఇలా చేయడం పట్ల పలువురు గ్రామస్తులు బాధను వ్యక్త పరుస్తున్నారు. ఆ ప్రజా ప్రతినిధిని అడుగుగా కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో, మమ్మల్ని ఎవడు ఆపలేడు అంటూ దుర్భాషలాడుతూ మాకు ఇదేమి కొత్త కాదంటూ జవాబు ఇచ్చాడు అక్కడి వ్యక్తి. ఈ కోళ్ల వ్యర్ధాలు తరలిస్తున్న వాహనంపై రమణ అని రాసి ఉంది. ఈ రమణ ఎవరు? కొల్లేరు చేపల చెరువులకు పెద్ద ఎత్తున రోజుకు మూడు నాలుగు లారీలు తరలిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Related posts

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నిరసన

Satyam NEWS

ఏపిలో మ‌రో 13 మంది ఐపీఎస్ లు బ‌దిలీ…!

Satyam NEWS

వైద్య కళాశాలలో తరగతులను ప్రారంభించనున్న సి‌ఎం

Murali Krishna

Leave a Comment