26.7 C
Hyderabad
April 27, 2024 09: 52 AM
Slider తూర్పుగోదావరి

తూర్పుగోదావ‌రి జిల్లాలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఉన్నతాధికారులు

#eastgodavari

నోటీసులు ఇవ్వ‌కుండా..రేష‌న్ డీల‌ర్ షాపు మూసివేత‌కు య‌త్నం…! ముందస్తు అనుమ‌తి లేకుండా రావ‌డ‌మేంటంటూ అధికారుల కండ్ల‌లో కారంకొట్టిన బాదితురాలు…! ఇదీ జ‌రుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో….. అదీ జ‌గ‌నన్న ప్ర‌భుత్వం అణ‌గారిన వ‌ర్గాన్ని ప‌రోక్షంగా అణ‌గ‌దొక్కేందుకు చేస్తున్న చ‌ర్య‌లు. అధికార పార్టీ అండ‌దండ‌లకు తోడు అదే అధికారుల‌కు చేతులు త‌డ‌ప‌డతంతో కాదేదీ చేతికి అన‌ర్హం అన్న‌ట్టుగా ఆన్ లైన్ లో ఏకంగా పేరునే మార్చేసిన ఘ‌నులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో   అధికార పార్టీ ఆగ‌డాలు మితిమీరుతున్నాయ‌న‌డానికి ఓ ఉదంతం….తూర్పుగోదావ‌రి జిల్లాలో వెలుగు చూసింది.

నోటీసులు ఇవ్వ‌కుండా ముంద‌స్తు స‌మాచారం అనేది లేకుండా ఓ నిమ్న జాతికి చెందిన ఓ మ‌హిళ‌కు చెందిన రేష‌న్ షాపును మూసివేసేందుకు య‌త్నించారు…ఆ  జిల్లా రామ‌చంద్ర‌పురం డివిజ‌న్  మెజిస్ట్రేట్ సిందు సుబ్ర‌హ్మ‌ణ్యం, డీఎస్పీ బాల‌చంద్రారెడ్డిలు. ఏకంగా ఆన్ లైన్ లో బాధిత మహిళ పేరు బ‌దులు అదికారి పార్టీకి  చెందిన మ‌హిళ పేరు మార్చారు. ఈ  విష‌యంపై అస‌లు బాధితురాలుకి ఏ విధ‌మైన ముంద‌స్తు నోటీసు ఇవ్వ‌కుండా రేష‌న్ డీల‌ర్ షాపును మూసివేయించుకు జిల్లాలోని రాయ‌వ‌రం మండ‌లం నుదురుబాద‌కు చెందిన ఎస్పీ కి చెందిన రేష‌న్ డీల‌ర్ మిర్త‌పాటి జ్యోతికి చెందిన షాపును మూసివేయించేందుకు రామ‌చంద్రాపురం ఆర్డీఓ,డీఎస్పీలు నుద‌రుబాధ వెళ్లారు. కానీ రేష‌న్ డీల‌ర్ పేరు మారింద‌ని  బాధితురాలు జ్యోతికి తెలియ‌కుండా అక‌స్మాత్తుగా నుదురుబాధ కుఆర్డీఓ,డీఎస్పీలు రావ‌డం,వాళ్లు వ‌చ్చి  రేష‌న్ డీల‌ర్ షాప్ ను తొల‌గించే య‌త్నానికి దిగ‌డంతో…ఇక ఓవైపు ఆత్మ‌ర‌క్ష‌ణ‌,మరోవైపు ముంద‌స్తు నోటీసు ఇవ్వ‌కుండా రావ‌డం,అలాగే నిమ్న జాతికి చెందిన మ‌హిళఅని చూడ‌కుండా ఉండ‌టంతో పాటు హైకోర్టు కేసు న‌డుస్తుండ‌గా అధికారులు రావ‌డంతో ఆ బాధితురాలు కండ్ల‌లో కారం చ‌ల్లింది.

ఇక రామచంద్రాపురం ఆర్డీఓ సింధూ సుబ్ర‌హ్మ‌ణ్యం….దివంగ‌త సీఎం వైఎస్ఆర్ చీఫ్ సెక్ర‌ట‌రీ సుబ్ర‌హ్మ‌ణ్యం కూతురు. సీఎం వైఎస్ఆర్  హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా మరణించారు. ఆయ‌న కుమార్తే… రామ‌చంద్రాపురం  ఆర్డీఓ సుబ్ర‌హ్మ‌ణ్యం. తండ్రి జాబ్ ను సింధుకు ఇవ్వ‌డంతో ప్ర‌స్తుతం రామచంద్రాపురం ఆర్డీఓ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. కాగా తాజాగా ఎస్సీకి చెందిన రేష‌న్ డీల‌ర్ షిప్ ను  వేరేకొరికి ఇచ్చే య‌త్నంలో భాగంగానే  నుదురుబాద‌కు చేరుకుని బాధితురాలుని ఖాళీచేసే య‌త్నం చేసారు. దీంతోబాధితురాలు ఇది అన్యాయ‌మంటూ త‌న రేష‌న్ డీల‌ర్  షాపు ను కాపాడుకోవ‌డంతో  పాటు త‌న‌ను ర‌క్షించుకునేందుకు అధికారుల కళ్ల‌ల్లో కారం చ‌ల్లార‌నే తెలుస్తోంది. ఏదైనా  గ‌డ‌చిన ముప్పై ఏళ్ల నుంచీ ఓ ఎస్సీ మ‌హిళ‌కు చెందిన రేష‌న్ డీల‌ర్ షిప్ ను అకార‌ణంగా అన్యాయంగా…ముంద‌స్తు లేకుండా ,హైకోర్టులో కేసుఉండ‌గా  క‌నీసం బాదితురాలికిముందుస్తునోటీసు ఇవ్వ‌కుండా కూల్చేయ‌డానికిరావ‌డం నిబంధ‌న‌ల‌ను తుంగ‌లోకి తొక్క‌డ‌మే.

Related posts

అయోధ్య కు సంఘీభావంగా స్థానిక ఆలయంలో పూజలు

Satyam NEWS

రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది

Murali Krishna

బీసీ కులాలకు అన్యాయంపై బీజేపీ ధర్నా

Satyam NEWS

Leave a Comment