26.7 C
Hyderabad
April 27, 2024 09: 04 AM
Slider ముఖ్యంశాలు

క‌రోనా ఆంక్ష‌ల‌తో హిందువుల పండ‌గుల‌పై ఆంక్ష‌లా…?

#hindujagananmunch

కరోన ఆంక్షల పేరుతో  ఏటా జ‌రుపుకుంటున్న‌  వినాయక చవితి ఉత్సవాల నిర్వహణను  ప్రభుత్వ చ‌ర్య‌లు నియంత్రించే విధంగా ఉన్నాయంటూ హిందూ ధ‌ర్మ జాగ‌ర‌ణ మంచ్ పేర్కొంది. నేడు విజయనగరంలో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు హిందువుల‌ మనోభావాలను దెబ్బతీసేవిధంగా వున్నాయ‌ని ఆరోపించింది. 

వినోద కార్యక్రమాలకూ,ఇతర ప్రభుత్వ,ప్రైవేటు సమావేశాలకూ, ఇతర మత ఉత్సవాలకూ అడ్డంకులు లేనప్పుడు, కరోన పేరుతో వినాయక ఉత్సవాలకు ఆంక్షలు పెట్టడమంటేని ప్ర‌శ్నించింది. అలాగే హిందువులకు గల సెంటిమెంట్లను గౌరవించి, వినాయక చవితి ఉత్సవాలు కూడా తగు జాగ్రత్తలతో నిర్వహించుకోవడానికి ఏ విధమైన ఆంక్షలు లేకుండ, అవసరమగు సహకారం అందించాలనీ ప్రభుత్వానికి, అధికారులకు విశ్వ హిందూ పరిషత్  కూడా కోరుతోంది.

కరోన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రజలందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని భక్తులను విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నది. ప్ర‌భుత్వం కూడా ఈ ఆంక్ష‌లను ఎత్తివేయాల‌ని అటు హిందూ  ధ‌ర్మ జాగ‌ర‌ణ మంచ్,ఇటు విశ్వ‌హిందూ ప‌రిష‌త్ లు డిమాండ్ చేస్తున్నాయి.

Related posts

ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల వెల్లువ

Satyam NEWS

గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Satyam NEWS

నిర్మల్ పట్టణ అభివృద్ధికి సత్వర సమగ్ర చర్యలు

Satyam NEWS

Leave a Comment