28.7 C
Hyderabad
April 27, 2024 06: 17 AM
Slider ఆదిలాబాద్

రేపు నిర్మల్ రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

#nirmal

హోం శాఖ మంత్రి అమిత్ షా రేపు నిర్మల్ లో నిర్వహిస్తున్న భారీ బహిరంగసభ కు లక్షలాదిగా ప్రజలు హాజరు కావాలని తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బిజెపి శాఖ ఛలో నిర్మల్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

రజాకార్ల పాలన కారణంగా ఎందరో మహానుభావుల ఆత్మ బలిదానాల తర్వాత హైదరాబాద్ సంస్థానానికి నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించింది. భారత దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చినా తెలంగాణ రాష్ట్రానికి 1948సెప్టెంబర్ 17 న వచ్చింది. అదీ కూడా ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలగజేసుకుని రజాకార్ల పాలన నుండి విముక్తి కలిగించి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. అందువల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ కోరారు.

Related posts

అమరావతిలో భూముల ధరలు పెరుగుతుంటే మేం చప్పట్లు కొట్టాలా?

Satyam NEWS

కల్నల్ సంతోష్ భార్యా పిల్లలకు గవర్నర్ సత్కారం

Satyam NEWS

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌కు గ‌ద్ద‌ర్ మ‌ద్ద‌తు

Bhavani

Leave a Comment