32.7 C
Hyderabad
April 27, 2024 01: 31 AM
Slider హైదరాబాద్

పీఎంని ప్ర‌త్యేక ప్యాకేజీ అడ‌గాలి

Vinod kumar

శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని అడగాలనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు సూచించారు.

విద్వేష మాట‌లు స‌రికాదు

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడటం సరి కాదని, జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం ఏం చేస్తామో చెప్పాలని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ కోసం ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని ప్రధాని మోడీని రాష్ట్ర బీజేపీ నాయకులు కోరాలని ఆయన అన్నారు.

మెట్రో రైలుకు నిధులు అడ‌గాలి

మెట్రోరైలుకు ఆయా కాలనీల నుంచి రవాణాను అనుసంధానం చేసేందుకు మోనో రైళ్ల కోసం ప్రధానికి రాష్ట్ర బీజేపీ నాయకులు నిధులు అడగాలని వినోద్ కుమార్ బీజేపీ నాయకులకు సూచించారు. విశ్వనగరం హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలు, వర్గాలు, వివిధ కులాలకు చెందిన వారు నివసిస్తున్నవిషయాన్నిగమనించాలని అన్నారు.

బీజేపీ, మ‌జ్లీస్ వ్యాఖ్య‌లు స‌రికాదు

బీజేపీ, మజ్లీస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు చెప్పడం, మహనీయులు పీ.వీ, ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చుతామని మజ్లీస్ నాయకులు చెప్పడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

అన్ని వ‌ర్గాల సంక్షేమ‌మే సీఎం ప్ర‌ధాన ఏజెండా!

హైదరాబాద్ ఏమైనా పాకిస్థాన్ లో ఉందా.? అని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు ఉన్న తేడా బీజేపీ నాయకులకు ఎందుకు తెలియడం లేదని వినోద్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓట్లు, సీట్ల కోసం బీజేపీ, మజ్లీస్ నాయకులు దిగజారి మాట్లాడటం, విద్వేషాలను రెచ్చ గొట్టడం దౌర్భాగ్యం అని ఆయన అన్నారు. డైనమిక్ సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో శరవేగంగా దూసుకుని పోతోందని వినోద్ కుమార్ తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన ఎజెండా అని అన్నారు.

సెంచ‌రీ దాటుతాం.. మేయ‌ర్ సీటు మాదే

శాంతి భద్రతల పరిరక్షణలో హైదరాబాద్ దేశంలోనే అగ్ర భాగాన నిలుస్తోందని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ, మజ్లీస్ నాయకులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ సీట్లు దాటుతామని, మేయర్ పీఠాన్నిసునాయాసంగా కైవసం చేసుకుంటామని వినోద్ కుమార్ భరోసా వ్యక్తం చేశారు.

Related posts

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జగన్ మనుషుల దాడులు

Satyam NEWS

సైకిల్ టూరిస్టు ఆష కు పోలీసుల అభినందన

Bhavani

నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ

Satyam NEWS

Leave a Comment