34.2 C
Hyderabad
May 19, 2025 17: 15 PM
Slider నిజామాబాద్

జుక్కల్ నియోజకవర్గంలో మువ్వనెల జెండాల రెపరెపలు

#MLAHanumanthShinde

జుక్కల్ నియోజకవర్గంలో 74 వ స్వతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మువ్వనెల జెండా రెపరెపలాడి౦ది.జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బిచ్కుందలో భాజపా కార్యాలయంలో మాజీ శాసనసభ్యురాలు అరుణతార, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు గంగాధర్, తెరాస కార్యాలయంలో అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి జెండాను ఎగురవేశారు,  మండల కేంద్రంలోని పోలీస్ ఠాణాలో సిఐ సాజీద్ ఎస్సై సాయన జెండాను ఆవిష్కరించారు.

తహసీల్దార్ కార్యాలయంలో  వెంకట్రావు, ఎంపిపి కార్యాలయంలో అశోక్ పటేల్, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ బాలాజీ, వ్యవసాయ కార్యాలయంలో ఏవో పోచయ్య, మార్కెట్ కమిటీ  కార్యాలయంలో చైర్మన్ సాయవ్వ  సాయిరాం, గోపన్పల్లిలో సర్పంచ్ శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు.

అదే విధంగా, హజ్ గుళ్లో సర్పంచ్ మారుతి, పెద్ద దేవాడలో సర్పంచ్ శివానంద్, పుల్కల్లో సర్పంచ్ విజయలక్ష్మి ,గుండె నెమలిలో సర్పంచ్ రాణి కిష్టారెడ్డి, బండరెంజల్ లోసర్పంచ్  గడ్డం బాల్రాజ్ ,రాజాపూర్లో సర్పంచ్ పోచ్చవ ,ఎల్లారం లో సర్పంచ్ గణపతి ,సీతారాంపల్లిలో సర్పంచ్ గంగారెడ్డి జెండాను ఆవిష్కరించారు.

ఇంకా ,శాంతాపూర్ లో సర్పంచ్ వెంకట్రెడ్డి, మానేపూర్ లో సర్పంచ్ దాసరి రాములు ,పెద్దదడిగి లో సర్పంచ్ ఆకుల సాయిలు, చిన్న దడిగిలో సర్పంచ్ అనిత విఠల్ రెడ్డి ,ఫథలాపూర్లో సర్పంచ్ అరుణ్ కుమార్, రాజులలో సర్పంచ్ చంద్రభాగ అశోక్ ,మిషన్ కళ్లాలిలో సర్పంచ్ సరస్వతీ బాయి, గుండె కల్లూరులో సర్పంచ్ సంగీత, కతగా౦ లో సర్పంచ్ జీవన్ జెండాను ఆవిష్కరించారు.

అదే విధంగా,రాజులలో సర్పంచ్ గంగారాం ,బిచ్కుందలో సర్పంచ్ శ్రీరేఖ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు ఉపసర్పంచ్లు ,బిచ్కుందలో ఎంపిడివో ఆనంద్ ,ఎంపిఓ మహబూబ్ ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిచ్కుందలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Satyam NEWS

సమస్యల పరిష్కారంకు సత్వర చర్యలు

mamatha

సరిహద్దుల్లో మొహరించి ఉన్న ఎయిర్ ఫోర్స్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!