26.7 C
Hyderabad
April 27, 2024 08: 52 AM
Slider ముఖ్యంశాలు

సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కుమార్ అనారోగ్యంతో మృతి

#srinivas

ఒంగోలులో ముగిసిన  శ్రీనివాస రావు అంత్య క్రియలు

సీనియర్ జర్నలిస్ట్ ఎం. శ్రీనివాస్ కుమార్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. పలు దినపత్రికలకు సేవలు అందించిన శ్రీనివాస్ ప్రస్తుతం సూర్య దినపత్రికలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీనివాస్ మరణవార్తతో జర్నలిస్టులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం  సాయంత్రం ఒంగోలు పట్టణంలో నిర్వహించారు. సౌమ్యుడు, స్నేహశీలి అయిన శ్రీనివాస్ కు ఏపీ 7 ఏ ఎం న్యూస్ వెబ్ సైట్ తో కూడా ఎంతో అనుబంధం ఉంది. తరచుగా ఏపీ 7 ఏ ఎం తో  కు ఆయన వార్తలను కాంట్రిబ్యూట్ చేసేవారు. వార్తను వేగంగా రాయడమే కాకుండా, ప్రెజంటేషన్ లో కూడా తనదైన శైలిని చూపించే శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ 7 ఏ ఎం తో  టీమ్ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపింది.

నారా లోకేష్ సంతాపం

సీనియర్ పాత్రికేయులు, సూర్య దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎం శ్రీనివాస్ మృతి పట్ల  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శ్రీనివాస్ మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి దిగ్భ్రాంతి

సీనియర్ పాత్రికేయులు, సూర్య దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎం శ్రీనివాస్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి చాలా విచారకరమన్నారు. సీనియర్ పాత్రికేయులు గా ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజలను చైతన్యం చేయడంలో తన వంతు బాధ్యతగా ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం  తెలిపారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని ప్రార్థించారు.

దామచర్ల జనార్దన్ సంతాపం

సీనియర్ పాత్రికేయులు, సూర్య దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎం శ్రీనివాస్ మృతి పట్ల మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్  విద్యాశాఖ బోధనేతర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సంఘం సంతాపం

సీనియర్ పాత్రికేయులు, సూర్యదినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ యం .శ్రీనివాస్ అకాలమరణం పట్ల చింతిస్తూ వారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆంధ్ర ప్రదేశ్  విద్యాశాఖ బోధనేతర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సంఘం తరఫున సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కే.వైకుంఠరాంశింగ్,  స్టేట్ పబ్లిసిటీ సెక్రటరీ నిమ్మల సుబ్బయ్య గౌడ్, స్టేట్ ట్రెజరర్  ఇరిగి రాజశేఖర్ సంతాపం తెలిపారు.

Related posts

సమగ్ర శిక్షా అభియాన్ లో అందరికి వేతనాలు పెంచాలి

Satyam NEWS

భర్త భార్య మధ్యలో ఇరుక్కున్న మాజీ ప్రియుడు

Satyam NEWS

కార్యనిర్వాహక రాజధాని దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

Satyam NEWS

Leave a Comment