38.2 C
Hyderabad
April 27, 2024 15: 27 PM
Slider ప్రత్యేకం

జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించండి

#uppalmla

ఉప్పల్ ఎంఎల్ఏ బేతి సుభాష్ రెడ్డిని కోరిన ఫెడరేషన్ నాయకులు

దీర్ఘకాలంగా అపరిషృతంగా జర్నలిస్టుల డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టిడబ్ల్యూజె ఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎంఎల్ఏ బేతి సుభాష్ రెడ్డికి ఫెడరేషన్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు.

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూ జె) జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమోహన్, టి డబ్ల్యూజె ఎఫ్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యవాపురం రవి, జిల్లా ఉపాధ్యక్షులు పటేల్ నరసింహ తదితరులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సుభాష్ రెడ్డి కి అందజేశారు.

ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలివ్వాలని ఎన్నో రోజులుగా అడుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. చాలా మంది జర్నలిస్టులు సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు.

విలేకరిగా పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ అక్రిటేషన్ కార్డు ఇవ్వాలని కోరారు.  జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఇందులో భాగంగా జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడుల నిరోధానికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్ధిక సహాయం అందించాలన్నారు. కరోనా పాజిటివ్ ఉన్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదే విధంగా చిన్న పత్రికలు, కేబుల్ టీవీ, వెబ్ చానళ్ళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని వారు కోరారు. రాష్ట్రస్థాయి మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. మీడియా అకాడమీకి బడ్జెట్ పెంచాలని, సమాచార శాఖకు పూర్తి స్థాయి కమీషనర్ నియమించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  ఫెడరేషన్ జిల్లా నాయకులు బూర శ్రీధర్, గుమ్మడి హరిప్రసాద్, జిల్లా మహిళా నాయకురాలు గుమ్మడి రోజారాణి, గోవిందుకుంట్ల ఆంజనేయులు, దొమ్మటి కిరణ్ కుమార్ రావు, కోట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎస్ సి, ఎస్ టి యువతకు ఎంఎస్ఎంఇ శిక్షణ

Satyam NEWS

కాళేశ్వరం జలకళ ఉత్తిదే: కాంగ్రెస్

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులకు డెటాల్ సబ్బుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment