37.2 C
Hyderabad
April 26, 2024 22: 45 PM
Slider కవి ప్రపంచం

చెప్పలేని హాయి

#ketavarapu rajyashree

ఉషోదయాన

సన్నని తుంపరలో తడుస్తూ

పక్షుల కిలకిలలు వింటూ

పచ్చని చేల వెంబడి నడుస్తుంటే

నులివెచ్చని హాయి

తొలకరి  జల్లుకు

భూమాత పులకించి

వెదజల్లిన మట్టివాసన

నాసికాపుటాలను  తాకుతుంటే కమ్మని హాయి

కురిసిన వాన జల్లు

చిరు కాలువలై పారుతుంటే

కాగితం పడవలు వేసి

మురిసిన పసితనం

ఎంతో హాయి

సాయం సంధ్యలో

పిట్టగోడ మీద కూర్చుని

చిరుజల్లులు ఆస్వాదిస్తూ

 వేడివేడి పకోడీలు తింటుంటే

పసందైన హాయి

అర్ధరాత్రి చిరుగాలి మోసుకొచ్చిన

చల్లని జల్లుకు ఒళ్ళు ఝల్లుమని

చెవుల  మీదకు దుప్పటి  లాగి ముడుచుకు పడుకుంటే

..చెప్పలేని ఆ హాయి

ఎంతో వెచ్చగ ఉంటుందోయి

భారత్ భాషా భూషణ్ డా. కేతవరపు రాజ్యశ్రీ, 8500121990

Related posts

నాటి బ‌కాసురుడే…నేడు “భూ బ‌కాసురుని “గా అవ‌త‌ర‌ణ‌

Satyam NEWS

ఏపీ ఫైబర్‌ నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ

Satyam NEWS

జిల్లా లో రెడ్ అలెర్ట్ ప్రజలు బయటకు రావద్దు… సహకరించాలి

Bhavani

Leave a Comment