32.7 C
Hyderabad
April 27, 2024 00: 17 AM
Slider ఆదిలాబాద్

కేసీఆర్ పాలనలో తెలంగాణ దిగజారిపోయింది

#yssharmila

కేసీఅర్ పాలన లో ఏ గ్రామం బాగుపడింది లేదు.. ఏ వర్గం బాగుపడింది లేదు… కేసీఅర్ జన్మ కి ఒక్క మాట కూడా నిలబెట్టుకున్నది లేదు అంటూ YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మన్ చాంద మండలం కనకపూర్ గ్రామంలో వైఎస్ షర్మిల కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ లో మాట మీద నిలబడే న్యాయకత్వం లేదని ఆమె అన్నారు.

ఉద్యమ కారుడు కదా అని పాలన చేతిలో పెడితే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు…16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు… ఇంత అప్పు తెచ్చినా ఏ పథకానికి డబ్బు లేదు…సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు…. తెచ్చిన అప్పులు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపంలో కేసీఅర్ తినేశాడు.. బంగారు తెలంగాణ ప్రజలకు కాదు..కేసీఅర్ కుటుంబానికి అయ్యింది అంటూ ఆమె విరుచుకుపడ్డారు.

కేసీఅర్,ఆయన కొడుకు,ఆయన బిడ్డ,ఆయన అల్లుడు కుటుంబాలకు అయ్యింది బంగారు తెలంగాణ అని షర్మిల అన్నారు. నిర్మల్  నైట్ క్యాంప్ నుంచి 189 వ రోజు  పాదయాత్ర ప్రారంభించిన  వైఎస్ షర్మిల నిర్మల్ మండల పరిధిలోని కొండాపూర్,రత్నాపూర్ కందిలి, లక్ష్మణ్ చంద్ మండల పరిధిలోని కంకపోర్, నర్సాపూర్, వడ్డేపల్లి, బోరెగాం, రాయధరి క్రాస్,మాంద మీదుగా పాదయాత్ర కొనసాగించారు.

Related posts

బిస్కెట్లు కొనివ్వమంటే అసభ్యంగా ప్రవర్తించిన తాత

Satyam NEWS

రజకులకు ఎస్సీ హోదా ఇవ్వాలి

Bhavani

భారత్‌కు ఎస్‌–400 క్షిపణి వ్యవస్థ అందజేత

Sub Editor

Leave a Comment