28.7 C
Hyderabad
April 28, 2024 10: 35 AM
Slider తెలంగాణ

మంత్రులతో కే‌సి‌ఆర్ అత్యవసరభేటి

kcr emergency meeting with ministers

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో  అందుబాటులో వున్న మంత్రులతో అత్యవసరంగా  భేటీ అయ్యారు. పాలనాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారని తెలుస్తున్నా, కే‌టి‌ఆర్ అమెరికా కు వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయటం పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రకటించిన కేసీఆర్ ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? నోటిఫికేషన్‌కు ఎంత సమయం పడుతుంది? పరీక్షా తేదీలు వంటి కీలక విషయాల గురించి ఆ శాఖల మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు జీవో 111 రద్దు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు వారం పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ తిరిగి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మంత్రులతో ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోనే సమావేశమయ్యారు. ఐతే మంత్రి కానీ ఎం‌ఎల్‌సి కవిత తో పాటు ఎం‌పి సంతోష్ కూడా ఈ సమావేశం లో పాల్గొన్నట్లు తెలుస్తున్నది. దీంతో కే‌టి‌ఆర్ లేకుండ జరుగుతున్న సమావేశం పై ఊహాగానాలు అధికమవుతున్నాయి.

Related posts

ఒంటిమిట్ట లో వేడుకగా ధ్వజారోహణం..

Satyam NEWS

పాకిస్థాన్ లో మళ్ళీ పుట్టిన ముసలం!

Satyam NEWS

గద్దర్ మరణ వార్త బాధగా ఉంది…ప్రియాంకా గాంధీ

Bhavani

Leave a Comment