42.2 C
Hyderabad
April 26, 2024 18: 16 PM
Slider ఆదిలాబాద్

గోండు రైతులకు ఉచితంగా జొన్న విత్తనాల పంపిణీ

#Krishi Vignana Kendram

శాస్త్రీయంగా పంటలు వేసి పౌష్టికాహారాన్ని పండించుకోవడం ద్వారా అధిక లాభాలను ఆర్జించడమే కాకుండా ఆరోగ్యం గా కూడా ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ రోజు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.రాజేశ్వర్ నాయక్,  సీనియర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె.వి.కె ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలంలోని భీమాజీ గూడా, పంగిడి మధర గీతనగర్, మర్కగూడ, పర్చికిగూడ, పెందురుగూడ, పుర్కగూడ, మందగుడ గ్రామాలలో రైతులకు ఈ మేరకు అవగాహన కల్పించారు.

జొన్న విత్తనాలను ఉచితంగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం .రాజేశ్వర్ నాయక్ మాట్లాడుతూ అధిక దిగుబడినిచ్చే జోవర్ సిఎస్‌వి -29 ఆర్ & కిన్నెరా న్యూట్రి సీరియల్ జొన్న విత్తనాలను ఉచితంగా సుమారు 100 మంది గిరిజన రైతులకు అందచేశారు.

అదే విధంగా  300 కిలోల, 100 కిలోల బయో ఫెర్టిలైజర్‌లను (టిఎస్‌పి) కూడా అందచేశారు. మొత్తం 100 ఎకరాలకు సరిపడే విత్తనాలను అందచేసినట్లు వారు తెలిపారు.

మహిళలకు పోషక విలువల గురించి అవగాహన కల్పించారు. పూలు,  పండ్లు కూరగాయలు, తీగజాతి పంటలను పందిరి కూరగాయలను పండించడం వలన వాటిలో ఉండే పోషక విలువలు విటమిన్ల గురించి రైతులకు తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో కె.వి.కె బెల్లంపల్లి శాస్త్రవేత్త డాక్టర్. శివకృష్ణ, ఎంపీటీసీ  పెందురు కేశవరావు, గ్రామ  సర్పంచ్, ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ (నాబార్డు) ప్రాజెక్ట్ కోఆర్డినేటర్- అడేపు  శేఖర్, స్టాఫ్  కైలాస్, సోము ,హరి రైతులు  సీడం లచ్చు , లక్ష్మబాయ్, సోంబాయి, ద స్వంత రావు, హనుమంతరావు పాల్గొన్నారు.

Related posts

పలకని ఫోన్లతో జగనన్నకు ఎలా చెబుతాం?

Satyam NEWS

రాజంపేట జనసేన నేతల గుడ్ మార్నింగ్ సీఎం

Satyam NEWS

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిపై ఐటి దాడులు

Satyam NEWS

Leave a Comment