27.7 C
Hyderabad
April 26, 2024 06: 30 AM
Slider వరంగల్

ఎల్ఆర్ఎస్ తో పేద మధ్యతరగతి వారిని దోపిడి చేస్తున్న ప్రభుత్వం

#CPIWarangal

భూముల క్రమబద్ధీకరణ (ఎల్ ఆర్ ఎస్ )పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ వల్ల  పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నడ్డివిరిచే విధంగా ఉందని దీనిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిపెడ మండల కేంద్రంలోని జరిగిన ఆందోళన కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 2015లో జీఓ 5 8 తొ 125 గజాల భూమి ఉన్నవారికి పట్టాలు ఇస్తామని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిందని అన్నారు.

నేడు రాష్ట్రంలో ఆర్ధిక లోటు ఉందని ఎల్ ఆర్ ఎస్ పేరుతో ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తున్నారని అన్నారు. చట్టాలను మారుస్తూ తనకి ఇష్టం ఉన్నట్లుగా జి ఓ లను తీసుకువచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేగాక ఇప్పటికే కోవిడ్ తో ప్రజలు, చిరువ్యాపారులు ,ఉద్యోగులు ,ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఎల్  ఆర్  ఎస్  తీసుకురావడం ప్రజలకు భారం గా ఉందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం  వెంటనే ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్

సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శి, మారగాని బాలకృష్ణ ,మున్సిపాలిటీ పట్టణ కార్యదర్శి అబ్దుల్ రషీద్ ,నాయకులు పోలేపాక వెంకన్న ,మాచర్ల భద్రయ్య, అంజి ,వెంకన్న ,నారాయణ, రాము, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణాను ప్రగతి బాటన నడిపిస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Satyam NEWS

కోర్ట్ డ్యూటీ అధికారులకు ఒక రోజు శిక్షణ

Satyam NEWS

Leave a Comment