28.7 C
Hyderabad
April 28, 2024 09: 56 AM
Slider నల్గొండ

సి.ఎం.ఆర్. బియ్యం సత్వరమే అందించాలి

#suryapet

సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ 2021-22 సంవత్సరానికి సంబంధించి సి.ఎం.ఆర్ బియ్యాన్ని సత్వరమే అందించాలని మిల్లుల యాజమాన్యులను అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లాలోని మిల్లుల యాజమాన్యులతో ఖరీఫ్  2021-22 దాన్యంకి సంబంధించి సి.ఎం.ఆర్. బకాయి  బియ్యం పై సంబంధిత శాఖ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2021-22 సి.ఎం.ఆర్. బియ్యం  లక్షా 42 వేల మెట్రిక్ టన్నులు బకాయి ఉండని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి సి.ఎం.ఆర్. రైస్ అప్పగించుటకై పలు మార్లు సమావేశాలు నిర్వహించడం జరిగిందని అయినప్పటికీ సి.ఎం.ఆర్. రైస్ అందించుటలో జాప్యం చేస్తున్నారని తెలిపారు.  జిల్లాలో ఉన్నటువంటి బకాయి మిల్లుల సామర్థ్యం ప్రకారంగా రోజు వారీగా మిల్లింగ్ చేసి ఎఫ్. సి.ఐ కి అప్పగించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అలా అప్పగించని మిల్లులపై సత్వర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

అనంతరం జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా, ప్రభుత్వ మార్గదర్శకాలు లోబడి జిల్లాలో 2021-22ఖరీఫ్ సీజన్ సి.ఎం.ఆర్. రైస్ ను త్వరితగతిన అందించేందుకు గట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డి.యస్.ఓ విజయ లక్ష్మి, డి.యం.రాంపతి, జిల్లా మిల్లర్స్ అధ్యక్షులు రవీంద్ర, డి.టి.లు నాగలక్షి, రాజశేఖర్, రామి రెడ్డి, విజయ్ శేఖర్ జిల్లాలోని వివిధ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెట్రో ధరలపై నిరసన వ్యక్తం చేసిన ఎంఐఎం నేతలు

Satyam NEWS

పి వి ని మరచిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS

పెద్దగట్టు హుండీలో రక్తంతో ప్రేమలేఖ

Murali Krishna

Leave a Comment