24.2 C
Hyderabad
July 20, 2024 18: 09 PM
Slider నిజామాబాద్

మైనార్టీ గురుకులాన్ని సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

shinde

కామారెడ్డి జిల్లా బిచ్కుంద  మండలంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శనివారం జుక్కల్‌  శాసన సభ్యులు హనుమంత్ సిండే పాఠశాలను సందర్శించి నిన్న జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పాఠశాల పిన్సిపల్ హాస్టల్  వార్డన్ లకు సూచించారు. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలంగాణ రాష్టప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థిపై లక్ష పైన  ఖర్చు పెడుతున్నారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించేందుకే గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. గురుకులాలను  చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా చేస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యేతో పాటు ఎంపిపి అశోక్ పటేల్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ అమరవీరు చిప్తి వార్డన్ అబ్దుల్ రజాక్, తహసీల్దార్ వెంకట్రావు ఉపతహశీల్దార్ మునిరోద్దిన్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

అంతిమ యాత్రలో పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

ప్రచారంలో ముందున్న…. డాక్టర్ చదలవాడ

Satyam NEWS

వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన డాక్టర్ కరుణాకర్

Satyam NEWS

Leave a Comment