32.7 C
Hyderabad
April 27, 2024 00: 34 AM
Slider జాతీయం

ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీం నిర్ణయం

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి భద్రత కల్పించడంలో లోపం ఉందన్న కేసులో సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ మొత్తం కేసును విచారిస్తుంది.

దర్యాప్తు కమిటీలో చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ ఏడీజీపీ ఉన్నారు. దీంతో పాటు పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీల విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈమేరకు తీర్పును వెలువరించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. భద్రతా వైఫల్యంపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీకి ఆదేశించింది.

Related posts

ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

వందేళ్ళ ఘనచరిత్ర ఎ ఐ టి యు సి కె దక్కింది

Satyam NEWS

వితిక చేతిలో చనిపోయిన వరుణ్

Satyam NEWS

Leave a Comment