40.2 C
Hyderabad
April 26, 2024 13: 51 PM
Slider ఆదిలాబాద్

ఆదివాసి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోండి

#soyambaburao

ఆదివాసి హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో పేరిట ఉద్యోగులు ఉపాధ్యాయులతో చెలగాటమాడుతోందని వెంటనే 317 జీవో రద్దు చేసి ఆదివాసీ హక్కులను కాపాడాలని ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళ సై గారిని ఆదివాసీ ప్రతినిధులతో సోయం బాపురావు కలిసి వినతిపత్రం సమర్పించారు.   రాజ్యాంగం చట్టబద్ధంగా ఆదివాసులకు కల్పించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. ఏజెన్సీలో భూ బదలాయింపు చట్టం పకడ్బందీగా  అమలు పరచకుండా ఆదివాసుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఏజెన్సీ అడిగిన వ్యవస్థ నిర్వీర్యం గా మారిందని, ఐటీడీఏ పీవో లు సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. పోడు భూములకు పట్టాలు కల్పించి.. ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసులకు భయం ప్రతిపాదిత హక్కులు కల్పించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదివాసుల పై పోలీసు రెవెన్యూ వేధింపులు పెరిగిపోయాయని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల్లో పారదర్శకత లోపించిందని 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

ట్విట్టర్ టిల్లు పది నిమిషాల్లో స్పందించాలి

Satyam NEWS

దివ్యాంగులకు సాయం చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా

Satyam NEWS

ప్రతీ సోమవారం చేనేత ధరించండి: కేటీఆర్

Satyam NEWS

Leave a Comment