42.2 C
Hyderabad
April 26, 2024 18: 03 PM
Slider సంపాదకీయం

తొలివిడత భారీ పోలింగ్: రెండో విడతా అంతే

#KurnoolDist

పంచాయితీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి అభిప్రాయానికి భిన్నంగా అధికార పార్టీ ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నది.

ఏకగ్రీవాలకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తొలి విడత పోలింగ్ లోనే అర్ధం అయింది. దాదాపు 82 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రంలో కరోనా ఉంది, అందువల్ల ఓటర్ల ఆరోగ్యానికి భద్రత లేదు, ఓటు వేసేందుకు రారు అని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పారు.

అయితే ఎక్కడా అలా జరగడం లేదు. అందరూ ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. రెండో దశలో కూడా అదే తీరు కనిపిస్తున్నది.

ఉదాహరణకు కర్నూలు జిల్లా నంద్యాల  రెవెన్యూ డివిజన్ సంజామల మండలం కానాల పోలింగ్ కేంద్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది.

ఈ ఉదయం 6:30 గంటల నుండే ఓటర్లు తమ పవిత్ర ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు.

అందులోనూ మహిళా ఓటర్లు మరింత ఉత్సాహంగా ముందుకు రావడం గమనార్హం

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన మేఘారెడ్డి

Satyam NEWS

టాప్ 5 లోకి దూసుకెళ్లిన షట్లర్ పీవీ సింధు

Satyam NEWS

పొంగే సంబరం

Satyam NEWS

Leave a Comment