42.2 C
Hyderabad
April 26, 2024 17: 29 PM
Slider ప్రపంచం

విశ్వ రహస్యాలను తెలిపే నాసా పవర్‌ఫుల్‌ టెలిస్కోప్‌

విశ్వ రహస్యాలను చేధించడానికి నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను కనిపెట్టింది. ఇది ఒక టైమ్ ట్రావెల్ మిషన్ లాంటిది. ఈ టెలిస్కోప్‌ను నాసా 2021 డిసెంబర్ 18వ తేదీన లాంచ్ చేయనుంది. కాగా, నాసా దీన్ని తయారు చేయడం వెనుక చాలా ప్రయోజనాలే దాగున్నాయి.

ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. టైమ్ మెషిన్‌లా పనిచేస్తుంది. వేల కోట్ల సంవత్సరాల కిందట.. బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టినప్పుడు దూసుకొచ్చిన కాంతి ఇప్పుడు విశ్వంలో ఎక్కడ ఉన్నా దానిని ఇది చూపిస్తుంది. అంటే విశ్వంలో మనకు అత్యంత దూరంగా ఉన్న గెలాక్సీలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, అన్నింటినీ అత్యంత స్పష్టంగా ఈ టెలిస్కోప్ చూపిస్తుంది.

వందల కోట్ల సంవత్సరాల్లో గెలాక్సీలు ఎలా పుట్టాయి, ఎలా పెరిగాయి, ఎలా విస్తరించాయి, ఎలా ఢీకొట్టుకున్నాయి, ఎలా కలిసిపోయాయి, అనే అంశాలను సైతం ఈ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటివి చూపించడంలో హబుల్ టెలిస్కోప్ చాలా బాగా ఉపయోగపడింది. కానీ దాని కాలం అయిపోవడంతో దాని స్థానంలో ఈ కొత్త టెలిస్కోప్ తీసుకువచ్చారు సైంటిస్టులు.

Related posts

కాశ్మీర్ తరలి వెళ్లిన అజిత్ దోవల్

Satyam NEWS

నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు

Bhavani

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇస్తాం

Satyam NEWS

Leave a Comment